AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల

ఏపీలో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి చేరింది. రేపటి నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి.

AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల

అమరావతి : ఏపీలో జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల చేశారు. మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రేపటి నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు అమల్లోకి తీసుకువస్తూ ఉత్తర్వులు వెలువరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 26జిల్లాల సంఖ్య 2 కొత్త జిల్లాల ఏర్పాటుతో 28 కి పెరిగింది.

రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మారుస్తూ నోటిఫికేషన్‌ వెలువడింది. వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు మార్పు చేస్తూ తుది నోటిఫికేషన్ జారీ అయింది.

ఇవి కూడా చదవండి :

Hyderabad Metro : న్యూ ఇయర్‌ వేడుకలకు.. మెట్రో వేళ‌ల పొడిగింపు
Silver, Gold Prices| భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు