Hyderabad Metro : న్యూ ఇయర్‌ వేడుకలకు.. మెట్రో వేళ‌ల పొడిగింపు

హైదరాబాద్ కొత్త ఏడాది వేడుకల కోసం మెట్రో రైలు వేళలను పొడిగించారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

Hyderabad Metro : న్యూ ఇయర్‌ వేడుకలకు.. మెట్రో వేళ‌ల పొడిగింపు

విధాత, హైదరాబాద్‌: కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఈ నెల 31న మెట్రోరైలు వేళలను పొడిగించారు. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి. ప్రారంభ స్టేషన్ల నుంచి రాత్రి ఒంటిగంటకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరుతాయి.

సాధార‌ణ రోజుల్లో రాత్రి 11 గంట‌ల వ‌ర‌కే చివ‌రి మెట్రో సేవలు అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మెట్రో రైళ్ల సమయాలను పొడిగించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి :

Siddipet : సిద్దిపేట తొగుటలో పెద్దపులి సంచారం
Journalist Accreditation : అక్రిడిటేషన్లు మరో రెండు నెలలు పొడిగింపు