Gouthami | కమల్ నుండి గౌతమి విడిపోవడానికి కారణం ఏంటి.. క్యాన్సర్‌ని ఎలా జయించింది?
Gouthami | 80వ దశకంలో సినీ రంగంలో అడుగుపెట్టి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వరుస సినిమాలతో తనదైన ముద్ర వేసిన నటి గౌతమి జీవితం నిజంగా స్ఫూర్తిదాయకం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన గౌతమి, డాక్టర్ల కుటుంబంలో పుట్టింది.
Gouthami | 80వ దశకంలో సినీ రంగంలో అడుగుపెట్టి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వరుస సినిమాలతో తనదైన ముద్ర వేసిన నటి గౌతమి జీవితం నిజంగా స్ఫూర్తిదాయకం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన గౌతమి, డాక్టర్ల కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రి ఆంకాలజీ ప్రొఫెసర్ కాగా, తల్లి పాథాలజిస్ట్. ఉన్నత విద్యా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, ఆమె జీవితం పూర్తిగా సినిమాల వైపు మలుపు తిరిగింది.నిజానికి గౌతమి లక్ష్యం ఐఐఎంలో ఎంబీఏ చేసి వ్యాపారవేత్త కావడం. ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ సీటు సంపాదించిన ఆమె, కాలేజీలో చదువుతున్న సమయంలో అనుకోకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
కాలేజీలో ర్యాగింగ్ నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో కేవలం రెండు వారాల షూటింగ్‌కు అంగీకరించడమే ఆమె సినీ ప్రయాణానికి ఆరంభంగా మారింది. ఆమె తొలి చిత్రం ‘దయామయడి’. మొదటి సినిమా చేస్తున్న సమయంలో సినిమాలపై ఏమీ తెలియదని గౌతమి పలుమార్లు వెల్లడించింది. కానీ షూటింగ్ సెట్‌లో కెమెరా, లైటింగ్, టెక్నికల్ అంశాలు అన్నీ దగ్గరుండి నేర్చుకుంటూ ముందుకు సాగింది. “వాట్ నెక్స్ట్?” అనే ఆలోచనతో తనను తాను నిరంతరం మెరుగుపరుచుకుంటూ, కేవలం ఎనిమిదేళ్ల వ్యవధిలోనే 120కి పైగా సినిమాల్లో నటించింది. ఒక దశలో ప్రతి ఏడాది 13 నుంచి 16 సినిమాలు విడుదలయ్యే స్థాయికి చేరుకుంది.
ఈ విజయయాత్రలో తన తల్లి పాత్ర ఎంతో కీలకమని గౌతమి భావోద్వేగంగా చెబుతుంది. తన సినీ అవకాశాల కోసం తల్లి తన డాక్టర్ వృత్తిని, డయాగ్నోస్టిక్ క్లినిక్‌ను కూడా వదిలేసి తనతో పాటు ప్రయాణించిందని వెల్లడించింది. 17 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చిన గౌతమికి, తల్లి అండదండలు ఆమె కెరీర్‌కు బలమైన పునాదిగా నిలిచాయి. సినీ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ గౌతమి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధిని ధైర్యంగా ఎదుర్కొని జయించింది. ఆ తర్వాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి, అద్వానీ నాయకత్వంలో బీజేపీలో పనిచేసింది. అయితే కొంతకాలం తర్వాత బీజేపీకి రాజీనామా చేసింది.
ఇక కమల్ హసన్‌తో విడిపోవడంపై తరచూ వినిపించిన ఊహాగానాలకు కూడా గౌతమి స్పష్టత ఇచ్చింది. తమ విడిపోవడానికి మరో వ్యక్తి లేదా నటి కారణం కాదని, అది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమేనని ఆమె వెల్లడించింది. విడిపోవడానికి గల కారణాలను నేరుగా చెప్పకపోయినా, తన నిర్ణయానికి తానే బాధ్యత వహిస్తానని పేర్కొంది. ఇంజనీరింగ్ విద్యార్థినిగా మొదలైన గౌతమి ప్రయాణం… స్టార్ హీరోయిన్‌గా, క్యాన్సర్ విజేతగా, రాజకీయాల్లో అడుగుపెట్టిన మహిళగా మారడం అనేక మందికి ప్రేరణగా నిలుస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram