మాదాపూర్‌లో హైడ్రా దూకుడు…రూ.2,200కోట్ల ప్రభుత్వ భూమికి రక్షణ

మాదాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టి రూ.2,200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించింది. మొండికుంట చెరువు పరిసరాల్లో ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Feb 12, 2026, 7:03 pm IST
Read Time: 2 mins
మాదాపూర్‌లో హైడ్రా దూకుడు…రూ.2,200కోట్ల ప్రభుత్వ భూమికి రక్షణ

విధాత, హైదరాబాద్ : హైదరాద్ పరిధిలో ప్రభుత్వ భూములు, పార్కులు, నాలాలు, రోడ్లు, చెరువు భూముల ఆక్రమణలపై హైడ్రా కొరడా జుళిపిస్తుంది. మాదాపూర్‌లో గురువారం చేపట్టిన భారీ ఆపరేషన్ లో రూ. 2,200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. హైటైక్స్ ఎగ్జిబిషన్‌ సెంటర్ సమీపంలోని మొండికుంటలో ఆక్రమణలు తొలగించింది. చెరువుతోపాటు సమీపంలోని ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను తొలగించింది.

ఆక్రమణదారులు 30కిపైగా దుకాణాల ద్వారా లక్షల్లో అద్దెలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో వాటిపై విచారణ చేసి…ఆక్రమణలను నిర్ధారించుకుని రంగంలోకి దిగింది. ఆక్రమణలను తొలగించి..విలువైన భూముల పరిరక్షణకు వాటి చుట్టు ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి :

Ambati Rambabu : అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్
Beach Landing in Mogadishu | బీచ్‌లో దిగిన విమానం… షాక్​లో ప్రయాణీకులు! – సోమాలియాలో అద్భుతం!