Weekly Horoscope | ఈ వారం రాశిఫలాలు.. పెళ్లి పీటలెక్కనున్న ఈ రాశి ప్రేమికులు..!
Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి రోజు, ప్రతి వారం తమ రాశిఫలాలకు అనుగుణంగా వ్యక్తులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృత్తిపరంగా ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు తమ పనితీరును మెరుగు పరచుకోవడం ద్వారా అధికారుల ప్రశంసలు అందుకుంటారు. పదోన్నతులకు కూడా అవకాశం ఉంది. నిరంతర కృషితో వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. ఆర్థికంగా అనేక మార్గాల నుంచి ధనం చేకూరడం వల్ల ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచింది. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైన శైలితో దూసుకెళ్తారు. వ్యాపార, వృత్తి నిర్వహణలో మీ నైపుణ్యాలతో విశేషమైన ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఉద్యోగులు తమ ప్రతిభకు తగిన గుర్తింపు, పురస్కారాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఎదగడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రేమికులు తమ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో అనుబంధం దృఢ పడుతుంది. విద్యార్థులకు చదువులో రాణించడానికి ఏకాగ్రతతో కృషి చేయాలి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులు ఈ వారం కొంత అప్రమత్తంగా మెలగాల్సిన సమయం. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. భాగస్వామ్య వ్యాపారాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. భాగస్వాములతో పని నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పనిపై దృష్టి సారిస్తేనే గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ నష్ట భయం ఉంది కాబట్టి ఆర్థికపరమైన రిస్క్‌లను వాయిదా వేయడం ఉత్తమం. ప్రేమ విషయాల్లో అనుకూలత కనిపిస్తోంది. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ఆచి తూచి నడుచుకోవాలి. పని నిమిత్తం ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఈ ప్రయాణాలు కొత్త బాధ్యతలను తెచ్చిపెడతాయి. వ్యాపారులు సంస్థ అభివృద్ధిపై దృష్టి సారించి సత్ఫలితాలు సాధిస్తారు. పాత వ్యాపార సమస్యలు తొలగుతాయి. రుణబాధలు నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే అవకాశాలు కలిసిరావు. ప్రభుత్వ పథకాల ద్వారా ఆశించిన నిధులు ఆలస్యం కావచ్చు. ప్రేమికులు తమ బంధాన్ని దృఢపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల ఆమోదం తప్పనిసరి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ఈ వారం వృత్తి పరంగా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో కొంత వ్యతిరేక పరిస్థితులు ఉండవచ్చు కాబట్టి ఉద్యోగులు సహోద్యోగులతో వాదనలకు దిగకుండా సమన్వయం పాటించాలి. వ్యాపారులు ముందుచూపుతో నిర్ణయాలు తీసుకోవాలి. అనవసరంగా డబ్బు ఖర్చు కావచ్చు. ప్రభుత్వ పథకాల ద్వారా పొందే ఆర్థిక ప్రయోజనాలు ఆలస్యం కావచ్చు. స్థిరాస్తి కొనుగోళ్లు అమ్మకాలలో స్తబ్దత నెలకొంటుంది. ప్రేమ విషయాల్లో ఓర్పు అవసరం. అవివాహితులకు కల్యాణ యోగం ఉంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. చట్టపరమైన వ్యవహారాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృత్తి పరంగా ఎదగడానికి నిరంతర కృషి చేయడం అవసరం. ఉద్యోగులు పెండింగ్ పనులు పూర్తి చేయడంపై దృష్టి సారిస్తే మంచిది. అధికారులతో సౌమ్యంగా నడుచుకోవాలి. వ్యాపారంలో సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. భాగస్వాములతో విభేదాలు, ఆర్ధిక నష్టాలు రాకుండా సరైన ప్రణాళికతో, పారదర్శకంగా వ్యవహరించాలి. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు ఉంటాయి. ఖర్చులు ఆదాయాన్ని మించకుండా జాగ్రత్త పడండి. ప్రేమ బంధాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెంచుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది.
తుల (Libra)
తుల రాశి వారికి ఈ వారం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవచ్చు. అయితే అనవసర వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. వ్యాపారులు నమ్మకమైన వ్యక్తుల సలహాలతో తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడం వలన లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థికంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభాలకు కూడా ఆస్కారం ఉంది. ప్రేమ జీవితం హాయిగా సాగుతుంది. జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది. కుటుంబంలో ఏర్పడే చిన్న చిన్న సమస్యలు సహనంతో పరిష్కరించుకోవచ్చు.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మెరుగైన పురోగతి సాధిస్తారు. ఉద్యోగులు తమ కృషికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. పదోన్నతులు, స్దాన చలనం ఉండవచ్చు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. సరికొత్త వ్యూహాలతో గణనీయమైన లాభాలు సాధించవచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం చాలా ముఖ్యం. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా, సామరస్యంగా ఉంటుంది. ఒక శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా కలిసి వస్తుంది. ఉద్యోగులు ఆశించిన పదోన్నతులు అందుకుంటారు. ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. దీంతో మరింత ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. అయితే వ్యక్తిగత వృత్తిపరమైన బాధ్యతల మధ్య సమతుల్యత పాటించడం ముఖ్యం. వ్యాపారంలో ఆటుపోట్లు ఉండే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే ఆర్థిక సమస్యలు ఉండవు. ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు మెరుగు పరచుకునే ప్రయత్నం చేయడం మంచిది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి పరమైన పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. మీ ప్రతిభకు సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి సానుకూల ఫలితాలు అందుతాయి. వ్యాపారంలో అభివృద్ధి కుంటుపడవచ్చు. అయితే సమయానుకూల నిర్ణయాలతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ఆర్థికంగా పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి. అప్పులు చేయడం, ఇవ్వడం చేయవద్దు. చట్టపరమైన చిక్కుల్లో పడకుండా జాగ్రత్త వహించడం ముఖ్యం. ప్రేమ విషయాల్లో చిన్నపాటి అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో కలిసి మానసిక ఉల్లాసాన్ని ఇచ్చే కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల బంధాలు బలపడతాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వృత్తిపరంగా తమ నైపుణ్యాలను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో అధికారయోగం ఉంటుంది. ఆశించిన పదోన్నతులు రావడంతో ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు, లాభాలు గణనీయంగా పెరుగుతాయి. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితిలో పెద్ద మార్పులు లేకపోయినా అవసరానికి సరిపడా ధనం లభిస్తుంది. షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే లాభాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో అవగాహన పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం అనేక విధాలుగా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. మీ అధికార పరిధి విస్తరిస్తుంది. సహోద్యోగులతో గొడవలు రాకుండా చూసుకోవాలి. వ్యాపారులు సాహసోపేతమైన నిర్ణయాలతో వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. అయితే ఊహించని ఖర్చుల కోసం సిద్ధంగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో సామరస్యత నెలకొంటుంది. ప్రియమైన వారితో మంచి సమయం గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram