Horoscope | మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి బంధు మిత్రులతో వివాదాలు..!
Horoscope | జ్యోతిష్యం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం.. అందువల్ల ఈ రోజు మన రాశిఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో కృషి చేస్తే లక్ష్య సాధనకు మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దైవబలంతో చేపట్టిన పనుల్లో సునాయాసంగా విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. పని ప్రదేశంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. గృహంలో ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతగా నడుచుకోవడం వలన ఆశించిన ఫలితాలు ఉంటాయి. కోపం అదుపులో ఉంచుకోకపోతే వివాదాలు, అపార్థాలు రావచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. స్పష్టమైన నిర్ణయాలతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు అందుకుంటారు. ఒక శుభవార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అవివాహితులకు కళ్యాణయోగం ఉంది. మీ ఆదాయ వనరులు పెరగవచ్చు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున ప్రారంభించిన పనులన్నీ విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో అధికార యోగం ఉంటుంది. ఉన్నతాధికారులతో చేసే చర్చలు ఫలవంతంగా ఉంటాయి. వ్యాపారంలో నూతన అవకాశాలు ఎదురవుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. దైవానుగ్రహంతో ప్రతికూల పరిస్థితులు తొలగుతాయి. ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కాలం అన్ని విధాలా సహకరిస్తోంది కాబట్టి అన్ని రంగాల్లో మేలైన ఫలితాలు రాబట్టడానికి సరైన సమయం.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. సంతానంకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు. కొన్ని సంఘటనలు బాధ కలిగించినా సహనం, ఓర్పుతో ఉంటే విజయం మీ సొంతం అవుతుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ నెరవేరడంతో ఉత్సాహంగా ఉంటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారులు కీలక ప్రాజెక్టులు దక్కించుకుంటారు. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి పరంగా ప్రయోజనం పొందుతారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం, అదృష్టం ఇలా అన్నీ ఒకేసారి కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయ ధోరణితో ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగులు సహచరుల నుంచి సహకారం అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు రావడం సంతోషం కలిగిస్తుంది.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్యం మీ వృత్తికి ఆటంకంగా మారుతుంది. కొన్ని సంఘటనలతో మానసికంగా విచారంగా ఉంటారు. బంధు మిత్రులతో వివాదాలు అశాంతి కలిగిస్తాయి. కీలక వ్యవహారాల్లో నిర్ణయం తీసుకునే శక్తి కొరవడుతుంది. ఖర్చులు అదుపు తప్పడంతో ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన సమస్యల నుంచి బయట పడతారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆచి తూచి అడుగేయాలి. కీలక నిర్ణయాలు తీసుకునేముందు పెద్దలను సంప్రదించడం మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో తెలివిగా వ్యవహరిస్తే ప్రతికూలతలు తొలగుతాయి. బుద్ధిబలంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. శుభకార్యాల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram