తెలంగాణ సీఎంతో మావోయిస్టు అగ్రనేతల భేటీ !
ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. ప్రభుత్వ సహాయంపై కీలక చర్చలు జరగనున్నట్లు సమాచారం.
విధాత, హైదరాబాద్ : ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యేందుకు మావోయిస్టు అగ్ర నేతలు దేవ్ జీ, మల్ల రాజిరెడ్డి సుజాత, బడే దామోదర్, చంద్రన్న, నూనే నర్సింహారెడ్డిలు శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ సెక్రటేరియట్ కు చేరుకున్నారు. మరికాసేపట్లో వారు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు.
వారి భేటీకి ముందు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, లొంగుబాటులో కీలకలంగా వ్యవహరించిన ఐజీ సుమతిలు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావడం గమనార్హం. లొంగుబాటుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయ, సహకారాలు, రాజకీయ పరమైన అంశాలపైన ఈ సందర్భంగా మావోయిస్టు నేతలు సీఎంతో చర్చించవచ్చని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :
ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Kavitha : కల్వకుంట్ల కవితకు బిగ్ రిలీఫ్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram