భూ రికార్డుల డిజిటలైజేషన్ ద్వారా వివాదాలు లేని భూ రికార్డులు

నూజివీడు,విధాత‌: భూమి రికార్డుల డిజిటలైజేషన్ ద్వారా భావితరాలకు వివాదాలులేని భూమి రికార్డులు అందుబాటులోకి ఉంటాయని సర్వే మరియు భూ రికార్డుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె. సూర్యారావు అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశం హాలులో భూమి రికార్డుల డిజిటలైజేషన్ పై వి.ఆర్.ఓ లు, సర్వేయర్ల, రెవిన్యూ సిబ్బందితో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా సూర్యారావు మాట్లాడుతూ " వై.ఎస్.ఆర్. జగనన్న స్వచ్ఛ భూహక్కు, భూ రక్షా పథకం […]

భూ రికార్డుల డిజిటలైజేషన్ ద్వారా వివాదాలు లేని భూ రికార్డులు

నూజివీడు,విధాత‌: భూమి రికార్డుల డిజిటలైజేషన్ ద్వారా భావితరాలకు వివాదాలులేని భూమి రికార్డులు అందుబాటులోకి ఉంటాయని సర్వే మరియు భూ రికార్డుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె. సూర్యారావు అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశం హాలులో భూమి రికార్డుల డిజిటలైజేషన్ పై వి.ఆర్.ఓ లు, సర్వేయర్ల, రెవిన్యూ సిబ్బందితో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా సూర్యారావు మాట్లాడుతూ ” వై.ఎస్.ఆర్. జగనన్న స్వచ్ఛ భూహక్కు, భూ రక్షా పథకం “ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వివాదాలకు తావులేని భూమి రికార్డులను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఈ కార్యక్రమంను జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద మర్రిబంధం గ్రామంలో ప్రారంభించగా, క్లస్టర్ గ్రామాలుగా గంపలగూడెం, తిరువూరులలో చేపట్టడం జరిగిందన్నారు. ఆధునిక డ్రోన్ల పరిజ్ఞానం తో భూ సర్వే చేపట్టడంతో భూమి రికార్డులన్నీ పక్కాగా ఉంటాయని, భూమి రికార్డులను డిజిటలైజేషన్ చేయడం ద్వారా భూమి వివాదాలకు తావు ఉండదన్నారు. ప్రస్తుతం ఉన్న భూమి సర్వే రికార్డులు 100 సంవత్సరాల క్రితం చేపట్టడం జరిగిందన్నారు. భూమి రికార్డులను డిజిటలైజేషన్ చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ప్రజలకు తమ భూమి వివరాలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెంటనే తెలుసుకోవచ్చన్నారు. పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన గ్రామాలలో భూమి సర్వే పనులు 10 రోజులలో పూర్తి అవుతాయన్నారు. ” వై.ఎస్.ఆర్. జగనన్న స్వచ్ఛ భూహక్కు, భూ రక్షా పథకం “ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే పనులకు ప్రజలు సహకరించాలని సూర్యారావు విజ్ఞప్తి చేసారు. సమావేశంలో సర్వే, భూ రికార్డుల శాఖ కమీషనర్ కార్యాలయం అధికారి ఎం.వి.వి . సూర్యనారాయణ, డివిజినల్ సర్వే అధికారి రామరాజు, డివిజినల్ పరిపాలనాధికారి ఎం. హరనాధ్, డివిజన్ లోని మండలాలకు చెందిన డిప్యూటీ తహసీల్దార్లు, వి.ఆర్.ఓ. లు, గ్రామ సర్వేయర్లు, రైతులు, ప్రభృతులు పాల్గొన్నారు.