JP Narayana | వైసీపీలోకి లోక్ సత్తా జేపీ ? విజయవాడ నుంచి ఎంపీగా పోటీ ?

JP Narayana విధాత‌: రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వినూత్న ప్రయత్నాలు చేసేందుకు జగన్ సిద్ధం అవుతున్నారా ? రాష్ట్రంలో మొన్న మొత్తం 25 ఎంపీలకుగాను 22 గెలిచినా విజయవాడను మాత్రం గెలవపోయారు. రెండుసార్లూ టీడీపీకి చెందిన కేశినేని నాని గెలిచారు. ఈసారి ఎలాగైనా విజయవాడ గెలవాలని ప్లాన్ వేస్తున్న జగన్ కొత్త మొహాలకోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరూ ఊహించని అభ్యర్థిని తెరమీదకు తెచ్చే యోచనలో ఉన్నారని అంటున్నారు. లోక్ సత్తా జయప్రకాశ్ ను […]

  • By: krs    latest    Aug 06, 2023 9:11 AM IST
JP Narayana | వైసీపీలోకి లోక్ సత్తా జేపీ ? విజయవాడ నుంచి ఎంపీగా పోటీ ?

JP Narayana

విధాత‌: రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వినూత్న ప్రయత్నాలు చేసేందుకు జగన్ సిద్ధం అవుతున్నారా ? రాష్ట్రంలో మొన్న మొత్తం 25 ఎంపీలకుగాను 22 గెలిచినా విజయవాడను మాత్రం గెలవపోయారు. రెండుసార్లూ టీడీపీకి చెందిన కేశినేని నాని గెలిచారు. ఈసారి ఎలాగైనా విజయవాడ గెలవాలని ప్లాన్ వేస్తున్న జగన్ కొత్త మొహాలకోసం చూస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఎవరూ ఊహించని అభ్యర్థిని తెరమీదకు తెచ్చే యోచనలో ఉన్నారని అంటున్నారు. లోక్ సత్తా జయప్రకాశ్ ను విజయవాడ నుంచి ఎంపీగా నిలబెడితే బావుంటుందని అనుకుంటున్నారట. అయన సామాజికవర్గం కమ్మ. దానికి తోడు మేధావి వర్గంగా పేరుంది. అవినీతి లేని వ్యక్తిత్వం. ఇవన్నీ కలగలిసి అయన గెలుపు సులువు ఆవుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈమధ్య జేపీ సైతం జగన్ ప్రభుత్వాన్ని కొనియాడుతూ మాట్లాడారు. గ్రామ సచివాలయాలు.. వాలంటీర్ల వ్యవస్థ చాలా గొప్పగా ఉందని, ఇది ప్రభుత్వ పాలనలో విప్లవాత్మక మార్పులకు ఒక సూచిక అని అన్నారు. దానికితోడు నిన్న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ వజ్రోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమానికి జేపీ సైతం హాజరయ్యారు. ఒకనాడు జయప్రకాశ్ నారాయణ ఆప్కాబ్ ఎండీగా పని చేశారన్న కారణంతో ఆయన్ను సైతం సభకు పిలిచారు.

ఇదే సభలో జగన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేపీ, జగన్ చనువుగా , కలివిడిగా మాట్లాడుకోవడం టీవీల్లో కనిపించింది. జేపీ సైతం ఎన్నడూ సీఎం జగన్ను గట్టిగా వ్యతిరేకించలేదు. దీంతో ఆయనకు జగన్ ప్రభుత్వం పట్ల సాఫ్ట్ కార్నర్ ఉందని , ఆయన్ను విజయవాడలో పోటీ చేయిస్తే కమ్మ సామాజికవర్గం సపోర్ట్ సైతం ఉంటుందని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ ప్రతిపాదనకు జేపీ నారాయ‌ణ‌ ఏమంటారు.. ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.