పోర్టు నిర్మాణానికి కేబినెట్‌ ఓకే

తొలివిడత రూ.5,155.73 కోట్లతో అభివృద్ధి 36 నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయం విధాత‌ : బందరు పోర్టు నిర్మాణానికి శుక్రవారం రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.5,155.73 కోట్లతో పోర్టును నిర్మించాలని నిర్ణయించింది. సవరించిన డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) ఆధారంగా ఈ పోర్టును 36 నెలల్లోగా నిర్మిం చాలని గడువు విధించారు. గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టుగా బందరు పోర్టు ను అభివృద్ధి చేసేందుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. 28తో ఈ-టెండర్లు పూర్తి : […]

పోర్టు నిర్మాణానికి కేబినెట్‌ ఓకే
  • తొలివిడత రూ.5,155.73 కోట్లతో అభివృద్ధి
  • 36 నెలల్లో పనులు పూర్తి చేయాలని నిర్ణయం

విధాత‌ : బందరు పోర్టు నిర్మాణానికి శుక్రవారం రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.5,155.73 కోట్లతో పోర్టును నిర్మించాలని నిర్ణయించింది. సవరించిన డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) ఆధారంగా ఈ పోర్టును 36 నెలల్లోగా నిర్మిం చాలని గడువు విధించారు. గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టుగా బందరు పోర్టు ను అభివృద్ధి చేసేందుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. 28తో ఈ-టెండర్లు పూర్తి : బందరుపోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ-టెండర్లు పిలిచింది. పోర్టు నిర్మాణం కోసం ఆ యా కంపెనీలు బిడ్‌లు దాఖలు చేసేందుకు ఈ నెల 28వ తేదీ వరకు గడువు ఉంది. మెగా, నవయుగ, చెన్నైలో ఇండో మెర్‌కు అనుబంధంగా ఉన్న మరో సంస్థ, ఢిల్లీకి చెందిన ఎన్‌ ఎండీసీ మినరల్‌ సంస్థ బిడ్‌లు దాఖలు చేసే అవకాశం ఉన్న ట్టు ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. డీపీఆర్‌లో సూ చించిన విధంగా బందరు పోర్టు నిర్మాణానికి తొలివిడత అభి వృద్ధి కోసం నిర్ణయించిన రూ.5,155.73 కోట్లకు ఏ సంస్థ త క్కువకు కోట్‌ చేస్తే వారికే పనులు కేటాయిస్తారు. ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ ఇటీవల బందరు పోర్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెగా, నవయుగ సంస్థ ప్రతినిధులతో సంప్రదింపు లు జరిపినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. గతంలో నవ యుగ సంస్థ బందరు పోర్టుపై పెద్దఎత్తున కసరత్తు చేయడం, వారివద్ద పోర్టు నిర్మాణానికి అవసరమైన యంత్రాలు, సాంకే తిక నిపుణులు ఉండటంతో పోర్టు నిర్మాణంలో భాగస్వామ్యం ఇచ్చేందుకు మార్గం సుగమం అయినట్టు సమాచారం. గతం లో మేటాస్‌ సంస్థకు పనులు కేటాయించగా, వివిధ కారణా లతో వాటిని రద్దు చేశారు. అనంతరం నవయుగ సంస్థకు ప నులు కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న రెండు నెలల వ్యవధిలోనే నవయుగ సంస్థకు ఇచ్చిన టెం డర్లను రద్దు చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రైట్స్‌ ద్వారా బందరు పోర్టు నిర్మాణం సాధ్యాసాధ్యాలు, ఇతర అంచనాలతో డీపీఆర్‌ను తయారు చేయించారు. దీని ఆధా రంగానే ఈ-టెండర్లు పిలిచారు. బ్యాంకుల నుంచి రుణం : బందరు పోర్టు తొలివిడత అభివృద్ధికి రూ.5,155.73 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఏపీ మేరిటైమ్‌ బోర్డు పోర్టు పనులను పర్యవేక్షిస్తుంది. పనులను కాంట్రాక్టుకు అప్పగించి నిధులను ప్రభుత్వమే సమకూరుస్తుంది. పోర్టు నిర్మాణం పూర్తయ్యాక ప్రభుత్వమే పోర్టు నిర్వహణ బాధ్యతలను చూస్తుంది. ఏపీ మేరిటైమ్‌ బోర్డు హామీతో కెనరా బ్యాంకు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా పోర్టుకు రుణం మంజూరు చేసేందుకు ఇప్పటికే సంప్రదింపులు జరిగాయి. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ ఇటీవల మచిలీపట్నం వచ్చినప్పుడు రుణం అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. రుణం ఇచ్చేందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. బందరుపోర్టుకు సంబంధించి డీపీఆర్‌ సక్రమంగా సమర్పిస్తే ఈ రెండు బ్యాంకులూ రుణం మంజూరు చేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా బందరు పోర్టు బాలారిష్టాలను దాటి నిర్మాణం వైపు అడుగులు వేయాలని జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.