Shree Charani : మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5కోట్ల చెక్
భారత మహిళా క్రికెటర్ శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ. 2.5 కోట్ల చెక్ ను మంత్రి నారా లోకేష్ అందజేశారు. నగదుతో పాటు ఆమెకు గ్రూప్-1 ఉద్యోగం, విశాఖలో ఇంటి స్థలం కేటాయించారు.
అమరావతి : భారత మహిళల క్రికెట్ జట్టు వరల్డ్ కప్ విజయంలో కీలక భూమిక పోషించిన మహిళా క్రికెటర్ శ్రీచరణికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నగదు ప్రోత్సాహకంగా రూ.2.5 కోట్ల చెక్ ను రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అందజేశారు. క్రీడల్లో మహిళలు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, ప్రభుత్వం ఎల్లప్పుడూ క్రీడాకారులకు అండగా ఉంటుందని లోకేష్ ఈ సందర్బంగా తెలిపారు. ఏపీ ప్రభుత్వం శ్రీచరణికి ప్రోత్సాహకంగా రూ.2.5 కోట్ల నగదుతో పాటు విశాఖలో 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్ 1 ఉద్యోగం కేటాయించిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని శ్రీచరణిని అభినందించారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు, ఎండి భరణి, స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Escalator Malfunction : ఎస్కలేటర్ రన్నింగ్..ప్రయాణికుల స్టన్నింగ్
Senior Heros | సీనియర్ హీరోలకి తలనొప్పిగా మారిన హీరోయిన్ సెలెక్షన్… టాలీవుడ్‌లో ఏజ్ గ్యాప్‌పై సీరియస్ చర్చ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram