జడ్జిలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో మరోసారి మండిపడ్డ ఏపీ హైకోర్టు
విధాత: ధర్మాసనం ముందు హాజరైన విశాఖ సీబీఐ ఎస్పీ.పంచ్ ప్రభాకర్ వీడియోలపై యూట్యూబ్‍కు లేఖ రాశామన్నారు.తమకు ఎలాంటి లేఖ రాలేదని చెప్పిన యూట్యూబ్ తరపు న్యాయవాది ఫేస్‍బుక్, వాట్సప్ తరపున హాజరైన న్యాయవాదులు ముకుల్ రోహత్గి, కపిల్ సిబాల్. రిజిస్ట్రార్ జనరల్ నుంచి అభ్యంతరకర పోస్టులపై విజ్ఞప్తి వస్తే వెంటనే ఆ పోస్టులు, వీడియోలు తొలగించాలన్న స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినికుమార్,ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కోరిన హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్. పంచ్ ప్రభాకర్‍పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో […]

విధాత: ధర్మాసనం ముందు హాజరైన విశాఖ సీబీఐ ఎస్పీ.పంచ్ ప్రభాకర్ వీడియోలపై యూట్యూబ్‍కు లేఖ రాశామన్నారు.తమకు ఎలాంటి లేఖ రాలేదని చెప్పిన యూట్యూబ్ తరపు న్యాయవాది ఫేస్‍బుక్, వాట్సప్ తరపున హాజరైన న్యాయవాదులు ముకుల్ రోహత్గి, కపిల్ సిబాల్.
రిజిస్ట్రార్ జనరల్ నుంచి అభ్యంతరకర పోస్టులపై విజ్ఞప్తి వస్తే వెంటనే ఆ పోస్టులు, వీడియోలు తొలగించాలన్న స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినికుమార్,ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కోరిన హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్. పంచ్ ప్రభాకర్‍పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.
పంచ్ ప్రభాకర్‍ను ఎవరో నాయకులు నడిపిస్తున్నారని సందేహం వ్యక్తం చేసిన స్టాండింగ్ కౌన్సిల్,అమెరికాలో ఉన్న ప్రభాకర్ తోకనే కట్ చేద్దామని వ్యాఖ్యానించిన ధర్మాసనం.పంచ్ ప్రభాకర్ విషయమై సీబీఐ డైరెక్టర్‍ను అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించాలని కోరిన స్టాండింగ్ కౌన్సిల్.సీబీఐ జాయింట్ డైరెక్టర్ అఫిడవిట్ వేస్తారని చెప్పిన సీబీఐ న్యాయవాది సుభాష్.సీబీఐ దర్యాప్తు చేపట్టి నెలలు గడుస్తున్నా పోస్టులు ఎందుకు ఆగడం లేదని ప్రశ్నించిన హైకోర్టు.