Site icon vidhaatha

AP Home Minister | ఖైదీలకు రాఖీ కట్టిన హోం మంత్రి అనిత

ap-home-minister-anitha-rakhi-celebrations-in-visakhapatnam-jail

AP Home Minister | అమరావతి : ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత రాఖీ పౌర్ణమి వేడుకలను విశాఖ పట్నం జైలులో ఖైదీలతో జరుపుకున్నారు. విశాఖ జైలులోని యువ ఖైదీలకు రాఖీలు కట్టిన హోం మంత్రి అనిత వారికి మిఠాయిలు తినిపించారు. 30 మంది ఖైదీలకు అనతి రాఖీ కట్టారు.

గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు ఆమె మళ్లీ అలాంటి నేరాలకు పాల్పడరాదని కౌన్సిలింగ్ ఇచ్చారు. తెలిసి తెలియని వయస్సులో ఈజీమనీ కోసం ఆలోచిస్తే, జీవితాలు నాశనం అయిపోతాయని..నేరాలకు పాల్పడి బంగారు భవిష్యత్తులను నాశనం చేసుకోవద్ధని వారికి సూచించారు.

అంతకుముందు విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు హోంమంత్రి అనిత రాఖీ కట్టి సోదరభావాన్ని వ్యక్తం చేశారు. విశాఖ ఎంవీపీ కాలనీ నుంచి ఉషోదయ జంక్షన్ వరకు ఆటోలో ప్రయాణించారు. ఆటోడ్రైవర్ గిరీశ్‌ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు కూడా రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కొర్లయ్యను పరామర్శించి రాఖీ కట్టారు. అవసరమైన సహాయం అందిస్తామని భరోసా కల్పించారు.

ఇవి కూడా చదవండి..

రిజర్వేషన్లపై పరిమితి లేదు!.. 50 శాతం మించొద్దని రాజ్యాంగంలో లేదు

40 ఏళ్ల తర్వాత కూడా బ్రెయిన్ యంగ్ గా ఉండాలంటే..

 

Exit mobile version