మాజీ సీఎం కేసీఆర్ కు రాఖీ కట్టిన సోదరీమణులు

రాఖీ పండుగ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ కు సోదరీమణులు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు. అయితే కేటీఆర్ బెంగుళూర్ పర్యటన కారణంగా కవిత రాఖీ కట్టలేకపోయినట్లు సమాచారం. కవిత-కేటీఆర్ విబేధాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది.

మాజీ సీఎం కేసీఆర్ కు రాఖీ కట్టిన సోదరీమణులు

విధాత, హైదరాబాద్ : రాఖీ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆయన సోదరమణులు రాఖీ కట్టారు. కేసీఆర్ సోదరీమణులు లక్ష్మీబాయి, జయమ్మ, వినోదమ్మలు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు. కేసీఆర్ సతీమణి శోభమ్మ, ఇతర కుటుంబ సభ్యుల్లో ఈ రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు.

మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన అన్న కేటీఆర్ కు రాఖీ కట్టలేకపోయినట్లుగా తెలుస్తుంది. కేటీఆర్ బెంగుళూర్ పర్యటనకు వెళ్లడంతో ఆయన అందుబాటులో లేని కారణంగా కవిత రాఖీ కట్టలేకపోయారని సమాచారం. అయితే కవితతో నెలకొన్న విబేధాల నేపథ్యంలోనే కేటీఆర్ ఆమెకు రాఖీ పౌర్ణమి వేడుకల సందర్భంగా ముఖం చాటేశారన్న ప్రచారం చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి..

ఖైదీలకు రాఖీ కట్టిన హోం మంత్రి అనిత

రాఖీ పండుగ వేళ..షర్మిల ట్వీట్ వైరల్ !