Andrapradesh | బ్లేడ్ బ్యాచ్‌లను, గంజాయిని అరికడుతాం ఏపీ హోంమంత్రి అనిత
గంజాయి అమ్మకం, వినియోగాలను అరికట్టేందుకు, బ్లేడ్ బ్యాచ్‌లను అణిచివేసేందుకు పోలీస్ శాఖ సీసీ కెమెరాలను, అధునిక టెక్నాలాజీని వాడుకుని ముందుకెలుతుందని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు

విధాత : గంజాయి అమ్మకం, వినియోగాలను అరికట్టేందుకు, బ్లేడ్ బ్యాచ్‌లను అణిచివేసేందుకు పోలీస్ శాఖ సీసీ కెమెరాలను, అధునిక టెక్నాలాజీని వాడుకుని ముందుకెలుతుందని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీలో శాంతిభద్రతలపై జరిగిన చర్చలో కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి గంజాయి మత్తులో బ్లేడ్ బ్యాచ్‌ల దాడుల సమస్యను వివరించారు. బ్లేడ్ బ్యాచ్‌ల దాడులను, గంజాయి మత్తులో జరుగతున్న నేరాలను నివారించాలని కోరారు. స్పందించిన హోంశాఖ మంత్రి అనిత గత వైసీపీ ప్రభుత్వ హయంలో గంజాయి విచ్చలవిడి అమ్మకాలు, వినియోగం పెరిగాయని, అదే రీతిలో బ్లేడ్ బ్యాచ్‌ల కేసులు సైతం రెట్టింపు అయ్యాయని తెలిపారు. వీళ్లను నియంత్రించే వ్యవస్థ పోలీస్ శాఖలో లేదని, టీడీపీ హయాంలో 15వేల మేరకు సీసీ కెమెరాల పెడితే వాటిలో అధిక భాగం పనిచేయడం లేదని, గత ప్రభుత్వ హాయంలో సీసీ కెమెరాల పునరుద్ధరణ చేసుకోలేకపోయారన్నారు. అసాంఘీక, అరాచక శక్తులు, బ్లేడ్ బ్యాచ్‌లు గతంలో ఇతర రాష్ట్రాల వారు ఉండేవారని, వారి స్థానంలో వైసీపీ పాలనలో స్థానికంగానే తయారయ్యారన్నారు. విద్యాసంస్థలకు సెలవులోస్తే వాటిల్లో కూడా చొరబడి దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఇలాంటి బ్యాచ్‌లను గతంలో పార్టీలు రాజకీయాలకు వాడుకున్నాయని, పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి వ్యతిరేకంగా అలాంటి దాడులు జరిగాయన్నారు. గంజాయి నివారణకు, బ్లేడ్ బ్యాచ్‌ల అణిచివేతకు టోల్ ప్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామని, సీసీ కెమెరాలను, ఆధునిక టెక్నాలాజీని పెంపొందించుకుని పోలీస్ శాఖ అన్ని విధాల సన్నద్దతో పనిచేయనుందని తెలిపారు.