Chennai | ఎలుక‌ల చేతిలో 22 కిలోల గంజాయి ఖ‌తం.. నిర్దోషులుగా బ‌య‌ట‌ప‌డ్డ స్మ‌గ్ల‌ర్లు

Chennai విధాత‌: ఎలుక‌లు చేసిన ప‌నికి ఓ ఇద్ద‌రు గంజాయి స్మ‌గ్ల‌ర్లు నిర్దోషులుగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఎలాగంటే.. 22 కేజీల గంజాయిని ఎలుక‌లు ఖ‌తం పట్టించ‌డ‌మే. స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీసు స్టేష‌న్‌లోని స్టోర్‌రూమ్‌లో ఉంచ‌గా, దాన్ని ఎలుక‌లు పూర్తిగా తినేశాయి. దీంతో చివ‌ర‌కు గంజాయిని కోర్టుకు స‌మ‌ర్పించ‌క‌పోవ‌డంతో.. స్మ‌గ్ల‌ర్ల‌ను నిర్దోషులుగా ప్ర‌క‌టిస్తూ కోర్టు తీర్పు వెల్ల‌డించింది. వివ‌రాళ్లోకి వెళ్తే.. త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలోని మెరీనా బీచ్ ప‌రిస‌రాల్లో రెండేండ్ల క్రితం రాజ‌గోపాల్, నాగేశ్వ‌ర్ రావు అనే ఇద్ద‌రు […]

Chennai | ఎలుక‌ల చేతిలో 22 కిలోల గంజాయి ఖ‌తం.. నిర్దోషులుగా బ‌య‌ట‌ప‌డ్డ స్మ‌గ్ల‌ర్లు

Chennai

విధాత‌: ఎలుక‌లు చేసిన ప‌నికి ఓ ఇద్ద‌రు గంజాయి స్మ‌గ్ల‌ర్లు నిర్దోషులుగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఎలాగంటే.. 22 కేజీల గంజాయిని ఎలుక‌లు ఖ‌తం పట్టించ‌డ‌మే. స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీసు స్టేష‌న్‌లోని స్టోర్‌రూమ్‌లో ఉంచ‌గా, దాన్ని ఎలుక‌లు పూర్తిగా తినేశాయి. దీంతో చివ‌ర‌కు గంజాయిని కోర్టుకు స‌మ‌ర్పించ‌క‌పోవ‌డంతో.. స్మ‌గ్ల‌ర్ల‌ను నిర్దోషులుగా ప్ర‌క‌టిస్తూ కోర్టు తీర్పు వెల్ల‌డించింది.

వివ‌రాళ్లోకి వెళ్తే.. త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలోని మెరీనా బీచ్ ప‌రిస‌రాల్లో రెండేండ్ల క్రితం రాజ‌గోపాల్, నాగేశ్వ‌ర్ రావు అనే ఇద్ద‌రు వ్య‌క్తులు గంజాయిని స్మ‌గ్లింగ్ చేస్తూ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. దీంతో వారిద్ద‌రిని 2020లో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. వారిద్ద‌రి వ‌ద్ద 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు చార్జీషీట్లో పేర్కొన్నారు. ఇందులో 50 గ్రాముల గంజాయిని ల్యాబ్ టెస్టుల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన‌ట్లు వివ‌రించారు.

ఇక ఈ కేసు విచార‌ణ చెన్నై హైకోర్టు ప‌రిధిలోని మాద‌క ద్ర‌వ్యాల నియంత్ర‌ణ ప్ర‌త్యేక కోర్టులో జ‌రిగింది. మంగ‌ళ‌వారం కేసు తుది విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కోర్టుకు పోలీసులు సాక్షాధారాలు చూపించాల్సి వ‌చ్చింది. అయితే రెండేండ్ల క్రితం స్వాధీనం చేసుకున్న 22 కేజీల గంజాయిలో కేవ‌లం 50 గ్రాముల గంజాయిని మాత్ర‌మే కోర్టుకు పోలీసులు స‌మ‌ర్పించారు.

మిగిలిన మొత్తం ఎక్క‌డా? అని పోలీసుల‌ను న్యాయ‌మూర్తి ప్ర‌శ్నించ‌గా, స్టేష‌న్‌లోని స్టోర్ రూమ్‌లో ఉంచ‌గా, ఎలుక‌లు తినేశాయ‌ని వివ‌రించారు. దీంతో ఛార్జీషీటులో పేర్కొన్న గంజాయి మొత్తాన్ని పోలీసులు స‌మ‌ర్పించ‌క‌పోవ‌డంతో ఈ కేసును కోర్టు కొట్టివేసింది. స్మ‌గ్ల‌ర్లు రాజ‌గోపాల్, నాగేశ్వ‌ర్ రావును కోర్టు నిర్దోషులుగా ప్ర‌క‌టిస్తూ తుది తీర్పు వెల్ల‌డించింది. ఈ కేసు క‌థ స్థానికంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.