Blade Batch | విజయవాడలో బ్లేడ్ బ్యాచ్.. అర్ధరాత్రి ఇష్టారాజ్యం

ఒంటరిగా కనిస్తే దాడులే. Blade Batch | విధాత, విజయవాడ : బ్లేడ్ బ్యాచ్.. విజయవాడలో కలకలం రేపుతోంది. ఒంటరిగా కనిస్తే దాడులకు తెగబడుతోంది. వీరి ఆడగాలకు అంతేలేకుండా పోతోంది. రోజు రోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి. అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్ చేస్తారు. నగదు దోచుకోవడమే కాకుండా బ్లేడుతో గాయపర్చి పరారవుతున్నారు. రాత్రి 12గంటలు దాటితే ఎక్కడ బ్లేడ్ బ్యాచ్ కాపుకాస్తుందోనని నగరవాసులను బెంబేలెత్తిస్తోంది. ఈ బ్యాచ్ చేసిన దారుణాలకు లేక్కలేదు. రూ.500 కోసం బ్లేడులతో […]

  • By: Somu |    latest |    Published on : Aug 24, 2023 12:53 AM IST
Blade Batch | విజయవాడలో బ్లేడ్ బ్యాచ్.. అర్ధరాత్రి ఇష్టారాజ్యం
  • ఒంటరిగా కనిస్తే దాడులే.

Blade Batch |

విధాత, విజయవాడ : బ్లేడ్ బ్యాచ్.. విజయవాడలో కలకలం రేపుతోంది. ఒంటరిగా కనిస్తే దాడులకు తెగబడుతోంది. వీరి ఆడగాలకు అంతేలేకుండా పోతోంది. రోజు రోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి. అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్ చేస్తారు.

నగదు దోచుకోవడమే కాకుండా బ్లేడుతో గాయపర్చి పరారవుతున్నారు. రాత్రి 12గంటలు దాటితే ఎక్కడ బ్లేడ్ బ్యాచ్ కాపుకాస్తుందోనని నగరవాసులను బెంబేలెత్తిస్తోంది. ఈ బ్యాచ్ చేసిన దారుణాలకు లేక్కలేదు. రూ.500 కోసం బ్లేడులతో దాడులు చేస్తున్నారు.

తాజాగా విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఖమ్మంకు చెందిన నాగరాజు విజయవాడలో కూలీ పనులు చేసుకుంటూ ప్లాట్ ఫాం మీద నిద్రపోతూ ఉంటాడు.
ఆర్ధరాత్రి రైల్వే వెస్ట్ బుకింగ్ నుంచి గాంధీహీల్ మీదుగా నడుచుకుంటూ వస్తున్న సమయంలో, గుర్తు తెలియని ఇద్దరు యువకులు మెడ మీద బ్లేడులతో దాడి చేశారు. అతని వద్ద ఉన్న రూ.600 లాక్కొని పారిపోయారు. గాయాలతో ఉన్న వ్యక్తిని స్థానిక పోలీసులు గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.