ఎమ్మెల్యే గంటా రాజీనామా ఆమోదం
విశాఖపట్నం నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం ఆమోదించారు

– నోటిఫికేషన్ జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి
విధాత: విశాఖపట్నం నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం ఆమోదించారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈక్రమంలో 2021 ఫిబ్రవరి 12న గంటా తన రాజీనామా లేఖను స్పీకర్ కు సమర్పించారు. అప్పట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న ఈ అంశంపై స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు.