ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ సీటు ఖరారు చేసింది. కర్ణాటక నుంచి షర్మిలకు రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలోనే రాజ్యసభ సీటు ఇస్తామని షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. కర్ణాటక నుంచి ఖాళీయైన నాలుగు స్థానాల్లో అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలాబలాలను అనుసరించి ఒక స్థానం బీజేపీకీ వెళ్లిపోతే, మిగిలిన మూడు స్థానాలు కాంగ్రెస్ కు దక్కనున్నాయి. ఈ మూడింట్లో ఒకటి ఖర్గేకు ఖాయం కానుండగా… మిగిలిన రెండు స్థానాల్లో ఒక స్థానంలో ఏపీకి చెందిన షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేయడం గమనార్హం.
షర్మిలకు రాజ్యసభ అవకాశం కల్పించడం ద్వారా ఏపీతో పాటు దక్షిణ భారత రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో.. దక్షిణాదిన బలహీనంగా ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీపై ఆ పార్టీ ఫోకస్ పెట్టిన క్రమంలో షర్మిలకు రాజ్యసభ అవకాశం దక్కినట్లయ్యింది.
