పోలీసు ఫిర్యాదుల అథారిటీకి సభ్యుల నియామకం
విధాత,అమరావతి:రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటీకి ముగ్గురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి కేవీవీ గోపాలరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.కిశోర్, ఉదయలక్ష్మి సభ్యులుగా నియామకమయ్యారు. వీరు బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి 3 ఏళ్లు లేదా 65 ఏళ్లు వయసు వచ్చేవరకు కాలపరిమితి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే ప్రభుత్వం పోలీసు ఫిర్యాదుల అథారిటీ ఛైర్మన్‌గా మద్రాస్ హైకోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.కనగరాజ్‌ను నియమించిన సంగతి తెలిసిందే. […]
విధాత,అమరావతి:రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటీకి ముగ్గురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి కేవీవీ గోపాలరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.కిశోర్, ఉదయలక్ష్మి సభ్యులుగా నియామకమయ్యారు. వీరు బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి 3 ఏళ్లు లేదా 65 ఏళ్లు వయసు వచ్చేవరకు కాలపరిమితి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే ప్రభుత్వం పోలీసు ఫిర్యాదుల అథారిటీ ఛైర్మన్‌గా మద్రాస్ హైకోర్ట్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.కనగరాజ్‌ను నియమించిన సంగతి తెలిసిందే.
ఇక జిల్లా స్థాయిలో ఛైర్మన్‌లు, సభ్యులను నియమించింది. 3 జిల్లాలకు ఒక ఛైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు ఛైర్మన్‌గా వరప్రసాదరావు, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు ఛైర్మన్‌గా విశ్రాంత జిల్లా జడ్జి ఆర్‌జే విశ్వనాథం, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఛైర్మన్‌గా నేతల రమేశ్‌బాబు, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతరం జిల్లాలకు ఛైర్మన్‌గా వెంకటరమణారెడ్డి నియమితులయ్యారు. జిల్లాల కమిటీ సభ్యులుగా విశ్రాంత విశ్రాంత కలెక్టర్‌లు, డీఎస్పీలను నియమించింది.అదనపు ఎస్పీ, అంతకంటే పై స్థాయి పోలీసు అధికారులపై వచ్చే ఫిర్యాదుల్ని ఈ అథారిటీ విచారిస్తుంది. తీవ్రమైన దుష్ప్రవర్తన, పోలీసు కస్టడీలో మృతి, దాడి, అత్యాచారం వంటి ఘటనలు జరిగిన సందర్భంలో వాటికి సంబంధించిన ఫిర్యాదుల విచారణకు దీనిని ఏర్పాటు చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram