నల్లమల అడవిలో చిక్కుకున్న భైరవ భక్తులు

విధాత:మైదుకూరు మండలం నల్లమల అడవిలోని మొండి భైరవుడి మొక్కు తీర్చుకునేందుకు వెళ్ళిన భక్తులకు వర్షాలతో ఇక్కట్లు..ఆదివారం మధ్యాహ్నం భారీగా వర్షాలు కురవడంతో ముదిరెడ్డిపల్లె తండా నుండి బైరవకోన కు వెళ్లే రహదారిలో పలు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో భక్తులు తిరిగి తమ ప్రాంతాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మైదుకూరు ప్రాంత పరిధిలోని భక్తులతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా అధిక వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. […]

నల్లమల అడవిలో చిక్కుకున్న భైరవ భక్తులు

విధాత:మైదుకూరు మండలం నల్లమల అడవిలోని మొండి భైరవుడి మొక్కు తీర్చుకునేందుకు వెళ్ళిన భక్తులకు వర్షాలతో ఇక్కట్లు..ఆదివారం మధ్యాహ్నం భారీగా వర్షాలు కురవడంతో ముదిరెడ్డిపల్లె తండా నుండి బైరవకోన కు వెళ్లే రహదారిలో పలు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో భక్తులు తిరిగి తమ ప్రాంతాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మైదుకూరు ప్రాంత పరిధిలోని భక్తులతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా అధిక వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బైరవకోన కు తీసుకెళ్లిన ట్రాక్టర్లు కూడా వాగుల్లో ప్రవహించే పరిస్థితి లేదు.దీంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు .పలు గ్రామాల నుండి ఇ అధిక సంఖ్యలో భక్తులు భైరవకోన కు వెళ్లడంతో రాకపోకలు నిలిచిపోయి కారణంగా భయాందోళన చెందుతున్నారు.