ఆమె ఒక అవినీతి అనకొండ: ఐఏఎస్ శ్రీలక్ష్మిపై భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్
టీడీపీ బాండ్ల స్కామ్ లో శ్రీలక్ష్మి పాత్రపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.

అమరావతి : ఐఏఎస్ శ్రీలక్ష్మిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక అవినీతి అనకొండ అని, అవినీతితో వేల కోట్లు లూటీ చేసిందని ఆరోపించారు. ఆమె కట్టే చీర ఖరీదు ఎంత? ఆమెకు వచ్చే జీతం ఎంత? అని…శ్రీలక్ష్మి ధరించే చీర ఖరీదు రూ.లక్షన్నర అని విమర్శించారు. ఒక్కోటి 50లక్షలకు పైగా విగ్గులు ఆమె వద్ద ఉన్నాయని ఒక్కో రోజు ఒక్కో విగ్గుతో కనిపిస్తారన్నారు. టీడీఆర్ బాండ్ల స్కాంలో శ్రీలక్ష్మి పాత్ర ఉందని..ఆమె టీడీపీ నేతలతో కలిసి రూ.వందల కోట్లు దోచుకున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. టీబీఆర్ బాండ్ల వివాదంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. శ్రీలక్ష్మీ రాష్ట్రంలోని మంత్రులందరినీ పూచికపుల్లలా చూసేవారని… తన శాఖ మంత్రులను సైతం లెక్కచేయలేదన్నారు. డబ్బు సంపాదించడమే తప్ప.. ఏ నైతిక విలువలూ లేని మనిషి అని… ఒక్క మాటలో చెప్పాలంటే ఓ పూతన, లంకిణి.. తాటకిలా కింది అధికారుల పట్ల ఆమె వ్యవహరించారు’’ అని భూమన తీవ్ర విమర్శలు చేశారు. తిరుపతిలో మా హయాంలో రోడ్లు వేసే క్రమంలో నిర్వాసితులకు పరిహారం చెల్లింపు ముసుగులో టీబీఆర్ బాండ్ల స్కామ్ కు పాల్పడిందని ఆరోపించారు. ఆధునిక రజీయా సుల్తాన్ ఇప్పుడు తమపై దుష్ఫ్రచారం చేసే కుట్రలో భాగస్వామిగా మారిందన్నారు. సుప్రీంకోర్టుకు సైతం శ్రీలక్ష్మి అవినీతి గూర్చి తెలుసన్నారు.