Divvela Madhuri | దువ్వాడ కేసులో.. దివ్వెల మాధురిపై కేసు నమోదు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదంలో దువ్వాడతో సన్నిహితంగా ఉంటున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు
ఆత్మహత్య యత్నం ఘటనపై పోలీసుల చర్యలు
విధాత, హైదరాబాద్ : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదంలో దువ్వాడతో సన్నిహితంగా ఉంటున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పలాస జాతీయ రహదారిపై దివ్వెల మాధురి ఆత్మహత్య యత్నంలో భాగంగా కారు ప్రమాదం చేసిన ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు.
దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి నాపైన, నా పిల్లలపైన అసభ్యంగా చేస్తున్న ట్రోల్స్‌ను తట్టుకోలేక బాధతో ఆత్మహత్య చేసుకునేందుకే కారు యాక్సిడెంట్ చేశానని మాధురి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెపై ఆత్మహత్య నేరంతో పాటు నిర్లక్ష్యంగా కారు నడిపి ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా వ్యవహరించినందునా పోలీసులు కేసు నమోదు చేశారు. నూతన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 125 ప్రకారం కేసు నమోదైంది. మరోవైపు దువ్వాడ వాణి, తన కుతూరుతో కలిసి భర్త శ్రీనివాస్ ఇంటి ముందు చేపట్టిన ఆందోళన కొనసాగుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram