ఒకప్పుడు కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పాం అని..ఇవాళ పిల్లలే సంపద చెబుతున్నానని ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పాపులేషన్ మేనేజ్మెంట్ ద్వారా దేశానికి జనాబాను సంపదగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం అని, అందుకే మూడు-నాలుగో సంతానానికి ప్రోత్సాహకం ఇచ్చేలా నిర్ణయం కూడా తీసుకుంటున్నాం అని స్పష్టం చేశారు. మూడో బిడ్డ పుట్టిన వెంటనే రూ.30 వేలు ఇస్తాం. నాలుగో బిడ్డ పుడితే.. రూ.40 వేలు ఇస్తాం. పిల్లలు భారమనుకోకూడదు.. వాళ్లే సంపద అని గుర్తించాలని తెలిపారు. తల్లికి వందనం కింద రూ.15 వేలు అందిస్తున్నాం. భగవంతుడు కరుణిస్తే.. ఈ మొత్తాన్ని పెంచుతాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు.. స్వచ్ఛాంద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
సమాజంలో మార్పు వస్తేనే స్వఛ్చాంధ్ర లక్ష్యం సాధ్యం
సమాజం మారితే స్వచ్ఛాంద్ర సాకారమవుతుందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రం మొత్తం పరిశుభ్రంగా ఉండాలనే స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమం చేపట్టాం. ఇది నా మనసుకు చాలా దగ్గరగా ఉండే కార్యక్రమం అన్నారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా ఇవాళ్టి నుంచే ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ ప్రారంభిస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతిరోజూ క్లీన్‌డ్రైవ్‌లు చేయాలని తెలిపారు. స్వచ్చాంధ్ర కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా రహదారులు శుభ్రంగా ఉంచేలా ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నాం అని వెల్లడించారు. స్వచ్ఛాంద్ర- స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నాం. స్వచ్ఛమైన ఆలోచనలు చేయాలి. అదే మనకు మంచి చేస్తుంది. అలవాట్లు మారాలి.. తద్వారా సమాజం మారుతుంది. గత 16 నెలలుగా స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర నిర్వహిస్తున్నాం. వ్యర్థాల నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం. ఒకప్పుడు నా పాదయాత్రల సమయంలో చెత్తే ఎక్కువ కనిపించేది. చెత్త నుంచి సంపద సృష్టించడానికి పార్కులు ఏర్పాటు చేశాం అని తెలిపారు.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని అన్నారు.
పేదరికం లేని సమాజం రావాలి
ఃక రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే ప్రక్రియ ద్వారా భూముల రికార్డులను ప్రక్షాళన చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నాం అని,
పేదరికం లేని సమాజం చూడాలనేదే తన కోరిక అని సీఎం చంద్రబాబు అన్నారు. సంపద సృష్టించి పేదవాళ్లకు పంచాలి. ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ప్రభుత్వానికి మంచిపేరు వచ్చిందంటే అది అధికారుల వల్లే వస్తుంది. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఏపీని తీర్చిదిద్దటంతో పాటు రూ.54 లక్షల తలసరి ఆదాయం తీసుకురావటం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. పేదవాళ్లకు చేయూతను ఇచ్చేలా పీ4 కార్యక్రమం చేపట్టాం.
మార్గదర్శి బంగారు కుటుంబాలుగా వ్యవహరించి పేదరికాన్ని రూపుమాపేలా ప్రయత్నం చేస్తున్నాం. సమాజంలో సంపద కలిగిన 10 శాతం మంది దిగువన ఉన్న 20 శాతం మందిని ఆదుకునేలా పీ4 కార్యక్రమం చేపట్టాం అని గుర్తు చేశారు. 2047 నాటికి ప్రపంచంలోనే అగ్రస్థాయి దేశంగా భారత్ మారుతుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ లక్ష్యం సాధిస్తాం అన్నారు.
గొడ్డలి పార్టీ విధ్వంసం నుంచి ప్రగతిలోకి రాష్ట్రం
గత ఐదేళ్లు గొడ్డలి పార్టీ చేసిన అరాచకం చూశాం. ప్రజల ఆస్తులన్నీ మార్చేసి గందరగోళం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల భూముల జోలికి ఎవరూ రాకుండా చర్యలు చేపట్టాం. భూ తగాదాలు లేకుండా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని పునరుద్ధరించి మళ్లీ ఏపీ బ్రాండ్ ను తీసుకువచ్చాం. వాళ్లు చేసిన విధ్వంసం మర్చిపోతే మళ్లీ మనపై గొడ్డలి వేటు పడుతుంది అన్నారు. కులాల మధ్య, ప్రాంతాల మధ్యా చిచ్చుపెట్టి అరాచకం సృష్టిస్తున్నారు అని, నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో అంచనాల్లో ఫేక్ న్యూస్ ప్రచారంలో ఏపీ రెండోస్థానంలో ఉందని గుర్తు చేశారు. అంటే వైసీపీ చేసే దుష్ప్రచారాలు ఎలా ఉన్నాయో మనకు ఇట్టే అర్ధం అవుతుంది అని చంద్రబాబు తెలిపారు. బాబాయిని గొడ్డలితో చంపి నా చేతిలో గొడ్డలి పెట్టారు అని, ఇలాంటి ఫేక్ న్యూస్ లు డ్రామాలతో ప్రజల ముందుకు వస్తున్నారు అని, ఈసారి గొడ్డలి ప్లస్ తో ప్రజలపై పడతారు అని హెచ్చరించారు. దీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేలా కృషి చేస్తాం అని, ఏపీని దేశంలోనే నెంబర్ 1గా మార్చాలని సంకల్పం చేశాం అని తెలిపారు.
గత పాలకులు వదిలేసిన చెత్తను క్లీనింగ్ చేస్తున్నాం
గత పాలకులు చేసిన చెడును మర్చిపోలేం అని, 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను గత పాలకులు వదిలేసి వెళ్లారు. దానిని తొలగించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం అని చంద్రబాబు తెలిపారు. చెత్త నుంచి విద్యుత్ తయారు చేసేలా ప్లాంట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాం అని, ప్రతీ ప్రాంతంలో వస్తున్న చెత్త కాంపోస్టుగా, సర్క్యులర్ ఎకానమీ లేదా విద్యుత్ తయారీ ప్లాంట్లకు తరలించేలా ప్రయత్నం చేస్తున్నాం అని, రాష్ట్రవ్యాప్తంగా చెత్తను వేరు చేయడానికి సెగ్రిగేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేసాం తద్వారా డంపింగ్ యార్డులకు స్వస్తి పలుకుతున్నాం అని పేర్కొన్నారు. నెట్ జీరో క్యాంపస్‌లుగా రాష్ట్రంలోని హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను తయారు చేస్తున్నాం అని, వ్యర్ధాలు లేకుండా వాటిని స్వచ్ఛమైన క్యాంపస్ లు గా రూపోందిస్తున్నాం అన్నారు . ప్రతీ ప్రభుత్వ కార్యాలయం పైనా సోలార్ రూఫ్ టాప్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించాం అని, ముస్తాబు కార్యక్రమంలో విద్యార్ధుల్లో పరిశుభ్రతను పెంపొందిస్తున్నామని, ఆత్మవిశ్వాసాన్ని నేర్పేలా అమలు చేస్తున్నాం అని చెప్పారు. స్వచ్ఛ రధాల ద్వారా ఘన వ్యర్ధాలు, ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను సేకరిస్తున్నాం అని, రాష్ట్రంలోని ప్రాంతాలను 33 శాతం పచ్చదనం వచ్చేలా లక్ష్యాలను నిర్దేశించాం అని పేర్కొన్నారు.
గత 23 నెలల్లో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అని, రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో మన పిల్లలకు 24 లక్షల ఉద్యోగాలు వస్తాయి అని చంద్రబాబు తెలిపారు. విశాఖకు గూగుల్ తీసుకొచ్చాం. ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెల్లడం కాదు.. పరిశ్రమలతో ఉత్తరాంధ్రకే వలసలు రావాలి’’ అని చంద్రబాబు అన్నారు.
ఇవి కూడా చదవండి :
బండి సంజయ్ ని మంత్రి పదవి నుంచి తొలగించాలి: ప్రధానికి బాధితురాలి లేఖ
వైరల్..వృద్ధ దంపతులపై అమానవీయ చర్య
