ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నా చంద్రబాబు

విధాత :తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు. విమానాశ్రయంలో పార్టీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, తంగిరాల సౌమ్య, కార్యకర్తలు…ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నేరుగా ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అనంతరం మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. పీవీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న చంద్రబాబు రేపు దీక్ష చేపట్టనున్న చంద్రబాబుకొవిడ్ బాధితులను ఆదుకోవాలనే […]

ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నా చంద్రబాబు

విధాత :తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు. విమానాశ్రయంలో పార్టీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, తంగిరాల సౌమ్య, కార్యకర్తలు…ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నేరుగా ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అనంతరం మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

పీవీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న చంద్రబాబు

రేపు దీక్ష చేపట్టనున్న చంద్రబాబు
కొవిడ్ బాధితులను ఆదుకోవాలనే డిమాండ్​పై సాధన దీక్ష పేరిట రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు తెలుగుదేశం పిలుపునిచ్చింది. పార్టీ అధినేత చంద్రబాబు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అమరావతి ఎన్టీఆర్ భవన్​లో నిర్వహించే ఆందోళనలో పాల్గొననున్నారు. చంద్రబాబుతో పాటు మరో 15 మంది సీనియర్ నేతలు ఆందోళనలో పాల్గొననుండగా..అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు నిరసనలు చేపట్టనున్నారు. కొవిడ్ మృతుల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు, ఆక్సిజన్ అందక చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు, కొవిడ్ విధులు నిర్వర్తిస్తూ చనిపోయిన ఫ్రంట్​లైన్ వారియర్స్ కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలనే డిమాండ్‌తో తెదేపా దీక్షకు పిలుపునిచ్చింది. తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబానికి, జీవనోపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు.