Auto Drivers Scheme In AP | ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభించిన చంద్రబాబు

ఏపీలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల కుటుంబాలకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించే ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

Auto Drivers Scheme In AP | ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభించిన చంద్రబాబు

అమరావతి : ఏపీలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల కుటుంబాలకు రూ.15వేల ఆర్థిక చేయూతనందించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకానికి సీఎం చంద్రబాబు శనివారం ఉండవల్లిలో శ్రీకారం చుట్టారు. ఈ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ లు పథకం లబ్దిదారుల కుటుంబ సభ్యులతో ఆటోలో ఉండవల్లి నుంచి సింగనగర్ బయల్దేరారు.

మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్లు ఇచ్చిన ఖాకీ చొక్కాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ , మాధవ్ లు ధరించారు. ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమానికి సంకేతంగా వేదిక మీద నేతల వెనుక మూడు ఆటోలు ప్రదర్శించారు. లబ్దిదారులైన ఆటో డ్రైవర్లతో కలిసి నేతలు వేదిక మీద కూర్చొన్నారు. సభా వేదిక మీద మంత్రులు మండిపల్లి, సత్యకుమార్, ఎంపీ కేశినేని చిన్ని తదితరులు ఉన్నారు. ఆటో డ్రైవర్ సేవ పథకంలో భాగంగా తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు రూ.436 కోట్ల మేర వారి ఖాతాల్లో జమ చేయనుంది. వీరిలో ఆటో డ్రైవర్లు 2.64 లక్షల మంది, ట్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు 6,400 మంది ఉన్నారు .కేటాయించిన నిధులను నేరుగా డ్రైవర్ల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు కేవలం ఏడాదికి 10 వేలు మాత్రమే ఇచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం 50 శాతం పెంచి 15 వేలు ఇస్తోంది.

cm-chandrababu-naidu-launches-auto-driver-service-scheme-rs-15k-aid

 

 

 

  • Beta

Beta feature