Chandrababu : సత్యసాయి జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
సత్యసాయి శతజయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు గిరిజన మహిళల కోసం సూపర్ స్పెషాలిటీ సేవలతో ‘సత్యసాయి ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్’ పథకాన్ని ప్రకటించారు.
అమరావతి : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. సత్యసాయి ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రాం పథకాన్ని ప్రారంభించనున్నట్లుగా ప్రకటించారు. సత్యసాయి ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రాం కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాదు అని.. దేశ నిర్మాణానికి ఒక ముందడుగు వంటిదని తెలిపారు. గిరిజన మహిళలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తాం అని వెల్లడించారు. మెడికల్ స్క్రీనింగ్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ కు చికిత్స అందిస్తాం అని తెలిపారు. సత్యసాయి బాబా తన సందేశాలతో చాలామందిలో పరివర్తన తెచ్చారని, మానవ సేవే మాధవ సేవ అని నమ్మి సత్యసాయి ఆచరించారని కొనియాడారు.
భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని.. దాన్ని మనమంతా అర్థం చేసుకోవాలి అని చంద్రబాబు అన్నారు. నీటి సమస్య లేకుండా బాబా అనేక ప్రాజెక్టులు నెలకొల్పి లక్షల మందికి తాగునీరందించారని గుర్తు చేశారు. విరాళాల రూపంలో వచ్చిన నిధులను ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించారన్నారు. ఎన్నో వైద్యాలయాలు స్థాపించి పేదలకు ఖరీదైన వైద్యం అందించారని, సత్యసాయి ట్రస్టుకు లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Principal Warning | ‘చంపి పడేస్తా’.. విద్యార్థికి ప్రిన్సిపాల్ వార్నింగ్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram