Principal Warning | ‘చంపి పడేస్తా’.. విద్యార్థికి ప్రిన్సిపాల్ వార్నింగ్

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన కొందరు గురువులు ఇటీవల వింత ధోరణులు ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ ప్రిన్సిపాల్ విద్యార్థిని తిడుతూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

Principal Warning | ‘చంపి పడేస్తా’.. విద్యార్థికి ప్రిన్సిపాల్ వార్నింగ్

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన కొందరు గురువులు ఇటీవల వింత ధోరణులు ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ ప్రిన్సిపాల్ విద్యార్థిని తిడుతూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తన మాట విననందుకు చంపి పారేస్తా అటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వార్నింగ్ ఇచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించి విద్యార్థిని కుటుంబసభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హపుర్ జిల్లాలోని పిఖువాలో వీఐపీ ఇంటర్ కాలేజీ 7వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యనందిస్తున్నారు.

అయితే, ఈ కాలేజీలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక కొద్దిరోజుల క్రితం తరగతి గది బయట స్నేహితురాలి కలిసి నిలబడి ఉంది. ఇది చూసిన ప్రిన్సిపాల్ వారిద్దరిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించిది. కాగా, ఆ బాలిక కొంచెం లేటు స్పందించడంతో ప్రిన్సిపాల్ తీవ్ర ఆగ్రహానికి గురైంది. బాలికపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నిన్ను చంపి పారేస్తా’ అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ తదంగాన్నంతా అక్కడే ఉన్న ఓ విద్యార్థి తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు వీడియో ఆధారంగా పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ చేశారు. ప్రినిపాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

బాలిక తల్లిద్రండులు మాట్లాడుతూ.. తమ కూతురు తీవ్రంగా భయాందోళనకు గురైందని.. పాఠశాలకు వెళ్లాలంటే జంకుతోందన్నారు. ప్రిన్సిపాల్ వార్నింగ్ కారణంగా బాలిక మెంటల్ హెల్త్ దెబ్బతిన్నదని.. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. కాగా, ప్రిన్సిపాల్ వార్నింగ్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ‘అలాంటి వారిని ఊరికే వదిలేయకూడదు.. కఠినంగా శిక్షించాలని’ డిమాండ్ చేస్తున్నారు. ‘ఆదర్శంగా నిలవాల్సిన టిచర్లే ఇలా చేస్తే.. ఇక పిల్లలు ఏం నేర్చుకుంటారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Hidma Flexi Controversy : హన్మకొండ జిల్లాలో మావోయిస్టు హిడ్మా ఫ్లెక్సీల కలకలం

Varanasi : ‘వారణాసి’ మూవీలో ఆరు పాటలు : కీరవాణి అప్డేట్