గూగుల్‌ డేటా సెంటర్.. ఏపీకి గేమ్‌ ఛేంజర్‌ : సీఎం చంద్రబాబు

విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీకి గేమ్ ఛేంజర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌గా నిలిచి ఉద్యోగాలు, పెట్టుబడులు తెస్తుందన్నారు.

అమరావతి : విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు ఏపీ ప్రగతికి గేమ్ ఛేంజర్ గా నిలవబోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచమంతా గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటేజజగూగుల్ ఏపీని ఎంచుకుందని గుర్తు చేశారు. టెక్నాలజీలో ఏపీ సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. భారతదేశానికి ఏపీ.. అంతర్జాతీయ డేటా గేట్‌వేగా నిలుస్తుందన్నారు.అని పేర్కొన్నారు. సెర్చ్‌ ఇంజిన్‌గా మొదలైన గూగుల్.. ఇప్పుడు భారత గ్రోత్‌ ఇంజిన్‌గా మారబోతోందన్నారు. గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌.. ఏపీ టెక్నాలజీతో పాటు దేశానికే గ్రోత్‌ ఇంజిన్‌ అని పేర్కొన్నారు.

30 ఏళ్ల క్రితం సైబరాబాద్ ను ఐటీ సిటీగా నిర్మాణం చేస్తే సంపద సృష్టికి కేంద్ర అయ్యిందని, విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో భారత చరిత్రలో 2026 ఏప్రిల్ 28వ తేదీ శాశ్వతంగా నిలిచిపోతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో టెక్నాలజీ రంగంలో ఏపీ తలెత్తుకుని నిలబడుతుంది అని, ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఇది… దేశానికి ఏఐ డేటా గేట్ వేగా ఏపీ నిలుస్తుందన్నారు. ప్రతిష్టాత్మక సంస్థ అదానీ గ్రూప్, ఎయిర్ టెల్ లాంటి దిగ్గజ సంస్థలు ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి..2028 సెప్టెంబరు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రారంభించాలని కోరుతున్నానని తెలిపారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఈ ప్రాంతానికి నీటి సమస్య లేదు అని, 60 రోజుల్లోనే గోదావరి నీరు విశాఖకు తీసుకువస్తాం అని, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న స్పీడ్ ఆఫ్ గవర్నెన్సుకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ నుంచి కూడా సహకారం తీసుకుంటాం అని చంద్రబాబు తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తున్నందుకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కి ధన్యవాదాలు చెబుతున్నామన్నారు.

ప్రాజెక్టుల గ్రౌండింగ్ లో కూడా ఏపీ నెంబర్ వన్..

దేశంలోకి వచ్చిన 25 శాతం పెట్టుబడులు ఏపీకే వచ్చాయి అని, ఒప్పందాలకు,పెట్టుబడులకే కాదు.. ప్రాజెక్టుల గ్రౌండింగ్ లో కూడా ఏపీ నెంబర్ వన్ గా ఉందని చంద్రబాబు తెలిపారు. సీఎంఓలోని నలుగురు కార్యదర్శులతో పాటు నాకు కొత్తగా ఏఐ అసిస్టెంట్ కూడా సుపరిపాలన అందించేందుకు సహకారం అందిస్తుందన్నారు. బులెట్ ట్రైన్ లాంటి ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని వివిధ రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నాం అని, వచ్చే నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టులు సాకారమయ్యేలా చూడాలని కేంద్రాన్ని కోరుతున్నట్లుగా తెలిపారు. ఈస్ట్ వెస్ట్ కారిడార్ ను కలపటం ద్వారా ఈ ప్రాంతాన్ని లాజిస్టిక్స్ పరంగా కూడా అభివృద్ధి చేయవచ్చు అన్నారు. పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం అని, 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాం. గూగుల్ రావటంతో విశాఖలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి అన్నారు. ఉత్తరాంధ్ర అంటే గతంలో వలసలు, నిరుద్యోగం కానీ ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రకే వలస వస్తారు. ఇక ట్యాలెంట్ మైగ్రేషన్ ముగిసిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జూలైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తాం అని, 2028 నాటికి ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నుంచి కూడా తొలి షిప్ మెంట్ ఎగుమతి అవుతుందన్నారు. రెన్యూ పవర్ ద్వారా ఇంగాట్ సోలార్ వేఫర్స్ ఉత్పత్తి కూడా మొదలవుతుందని, అనకాపల్లి జిల్లా మరో రంగారెడ్డి జిల్లాగా తయారై అభివృద్దికి కేంద్రం అవుతుందన్నారు.

ఇవి కూడా చదవండి :

అమరావతి-హైదరాబాద్ బుల్లెట్ రైలు: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఏపీలో ఇంధన సంక్షోభం.. డీజిల్ కోసం కాళ్లు పట్టుకున్న ఆక్వా రైతు!

Latest News