Devaragattu Bunny Festival | బన్ని ఉత్సవంలో కర్రల సమరం.. ముగ్గురు మృతి
కర్నూలు మాళ మల్లేశ్వర బన్ని ఉత్సవంలో కర్రల సమరంలో ముగ్గురు భక్తులు మృతి, 100 మందికి పైగా గాయపడ్డారు.

విధాత: ఏపీలో భక్తి ఉత్సవం పేరిట రక్తపాతం జరిగింది. సాంప్రదాయం పేరిట కర్రలతో దాడి చేసుకోవడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో వందమందికి పైగా గాయపడ్డారు.
కర్నూలు జిల్లా దేవరగట్టులో నిర్వహించే మాళ మల్లేశ్వరస్వామి బన్ని జైత్రయాత్రలో 2 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని తీసుకెళ్ళే సమయంలో జరిగే కర్రల సమరంలో ఇరు వర్గాలు దాడులు చేసుకోవడంతో తలలు పగిలి ముగ్గురు భక్తులు మృతి చెందగా, దాదాపు 100 మంది భక్తులు గాయపడ్డారు.
ఏపీలో భక్తి ఉత్సవం పేరిట రక్తపాతం
సంప్రదాయం పేరిట కర్రలతో దాడి
ముగ్గురు మృతి.. 100 మందికి పైగా గాయాలు
కర్నూలు జిల్లా దేవరగట్టులోని బన్నీ ఉత్సవంలో కర్రల సమరంలో సంప్రదాయం పేరిట దాడి చేసుకున్న ఇరువర్గాలు https://t.co/EYcYAdkzmX pic.twitter.com/bKourBQ30u
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2025