ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్ పరీక్షలకు డిజిటల్ వేల్యూషన్ పై అనుమానాలు
ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్ పరీక్షలకు అనుసరించిన డిజిటల్ వేల్యూషన్ పై అభ్యర్థులు వ్యక్తం చేస్తోన్న అనుమానాలు నివృత్తి చేయాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ. 2018లో జారీ అయిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ కు మెయిన్స్ రాత పరీక్ష గత ఏడాది డిసెంబర్ లో జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 28న ఫలితాలు ప్రకటించారు. దాదాపు 7000 మంది అభ్యర్థుల్లో ఇంటర్వ్యూ రౌండ్‌కు స్పోర్ట్స్ కోటా తో కలిపి […]

ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్ పరీక్షలకు అనుసరించిన డిజిటల్ వేల్యూషన్ పై అభ్యర్థులు వ్యక్తం చేస్తోన్న అనుమానాలు నివృత్తి చేయాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ.
2018లో జారీ అయిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ కు మెయిన్స్ రాత పరీక్ష గత ఏడాది డిసెంబర్ లో జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 28న ఫలితాలు ప్రకటించారు. దాదాపు 7000 మంది అభ్యర్థుల్లో ఇంటర్వ్యూ రౌండ్‌కు స్పోర్ట్స్ కోటా తో కలిపి 340 మంది ఎంపికయ్యారు. ఈ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులు సబ్ కలెక్టర్లుగా, ఆర్డీవోలుగా, ఉన్నతాధికారులుగాను సేవలందిస్తారు.
కాబట్టి, పరీక్షా విధానo పారదర్శకంగా, న్యాయంగా, లోపాలు, పక్షపాతం లేకుండా ఉండటం చాలా ముఖ్యం.పరీక్షలకు సంబంధించిన మూల్యాంకన సక్రమంగా జరగలేదనే ఫిర్యాదులు అనేకం వచ్చాయి. ఎంపిక విధానం గతంలో జరిగిన ప్రక్రియకు విరుద్ధంగా ఉంది. ఎలాంటి అధ్యయనం లేకుండా డిజిటల్ వేల్యూషన్‌ని ఎంచుకోవటం అనేక విమర్శలకు తావిస్తోంది. మాన్యువల్ వేల్యూషన్ చేయడం కోసం రూపొందించిన జవాబు పత్రాలను డిజిటల్ పద్దతిలో చేయటం వల్ల అర్హులైన వారు నష్టపోయే ప్రమాదం ఉంది.వచ్చే నెలలో ఇంటర్వ్యూ రౌండ్ ప్రారంభం కానున్నందున అభ్యర్థుల తరఫున 5డిమాండ్లు మీ ముందు ఉంచుతున్నాను.
- మెయిన్స్ జవాబు పత్రాలను మాన్యువల్ వేల్యూషన్ చేయాలి.
- ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లు, అందరి అభ్యర్థుల మార్కులను వెల్లడించాలి. ఇది వారి తదుపరి ప్రయత్నం కోసం, లోపాలు సరిచేసుకునేందుకు ఉపయోగపడుతుంది.
- డిజిటల్ వేల్యూషన్‌కి సంబంధించిన సాంకేతికత SOP పై శ్వేతపత్రాన్ని విడుదల చేయండి.
- ఎంపిక చేయని అభ్యర్థులందరి మార్కులు, వారి జవాబు పత్రాలను విడుదల చేయాలి
- ఎంపిక ప్రక్రియ, వేల్యూషన్‌పై అనుమానాలున్నవారి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
కోవిడ్-19 వైరస్ సాకుతో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో నిర్మాణాత్మక, విధానపరమైన, చట్టపరమైన పద్ధతులను విస్మరించడం తగదు. ముందుగా ఎటువంటి సన్నాహాకాలు జరగకుండా అమలుచేసిన డిజిటలైజేషన్ విధానం అభ్యర్థులకు శాపం కాకూడదు.