సెల్‌ఫోన్‌లు పోగొట్టుకున్నవారికోసం టోల్‌ఫ్రీ నెంబర్
సెల్‌ఫోన్‌లు పోగొట్టుకున్నవారికోసం ఏలూరు జిల్లా ఎస్పీ మేరీప్రశాంతి టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నెంబర్: 9550351100 ను అందుబాటులో

విధాత: సెల్‌ఫోన్‌లు పోగొట్టుకున్నవారికోసం ఏలూరు జిల్లా ఎస్పీ మేరీప్రశాంతి టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నెంబర్: 9550351100 ను అందుబాటులో ఉంచడంతో ఫోన్లు పోగొట్టుకున్న బాదితులు వెంటనే ఈ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యదు చేయడంతో వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఈ విధంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మొత్తం 2,522 ఫోన్లు పోయినట్లు ఫిర్యాదులు అందగా పది విడతలుగా వాటిని చేదించి 1,325 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వీటి విలువ దాదాపు 2,71,19,684. రికవరీ శాతం 53 % ఉన్నట్లు మొత్తం 12 కేసులు నమోదుచేసి 10 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. రికరీ చేసిన ఫోన్లను యజమానులకు అందించారు. ప్రజలు రద్దీ ప్రదేశాల్లో , ముఖ్యంగా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, ఏటీఎంల వద్ద అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ పోలీసు స్టేషన్ సిబ్బంది,సెల్ ట్రాఫిక్కింగ్ హెచ్‌సి సత్యనారాయణ, సైబర్ సెల్ సబ్ ఇన్స్పెక్టర్ రాజా తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.