Malla Reddy : ఏపీని చంద్రబాబు చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు

ఏపీ అభివృద్ధిని సీఎం చంద్రబాబు బాగా ముందుకు తీసుకెళ్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రశంసించారు.

Malla Reddy : ఏపీని చంద్రబాబు చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు

అమరావతి : ఏపీ రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు(CM Chandrababu) చాల బాగా అభివృద్ధి చేస్తున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Mallareddy) ప్రశంసించారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన మంగళవారం తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి కూడా ఏపీకి మంచి సహకారం అందుతుందని..ప్రధాని మోదీ రూ.లక్షల కోట్ల నిధులు ఇస్తున్నాడని..దీంతో చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారన్నారు.

బీఆర్ఎస్(BRS) పదేళ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని రీతిలో కేసీఆర్(KCR) తెలంగాణను అభివృద్ధి చేశారని.. కేటీఆర్(KTR) హైదరాబాద్ కు మల్టీ నేషనల్ కంపెనీలను తీసుకొచ్చారన్నారు. ప్రస్తుతం తెలంగాణలో(Telangana) రియల్ ఎస్టేట్ బాగాలేదని..ఒకప్పుడు ఏపీలో అమ్ముకుని హైదరాబాద్(Hyderabad) కు వచ్చే వారని..ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయిందన్నారు. తెలంగాణ వాళ్లు ఏపీలో ఆస్తులు కొని వ్యాపారాలు చేస్తున్నారన్నారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణలో పాత రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.