CM Chandrababu on P4 | సీఎం చంద్రబాబు : పేదరిక నిర్మూలనే పీ4 లక్ష్యం
“పేదరిక నిర్మూలనే పీ4 లక్ష్యం అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర విజన్‌తో రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు.

CM Chandrababu on P4 | అమరావతి : పేదరిక నిర్మూలనే పీ4 ప్రధాన లక్ష్యం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సమాజం వల్ల పైకి వచ్చిన వారు తిరిగి సమాజానికి ఎంతో కొంత చేయాలన్నదే పీ4 కార్యక్రమం అని..ఇది మానవతా ధృక్పథంతో చేసే స్వచ్ఛంద కార్యక్రమమని ఉద్ఘాటించారు. మంగళగిరిలో పీ4 ప్రారంభించి దత్తత తీసుకుంటున్నట్టు సంకేతంగా అడాప్ట్ ట్రీని బంగారు కుటుంబాలకు చంద్రబాబు అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సంపద అనేది ప్రజలకు మెరుగైన జీవనం కలిగించేందుకు ఉపయోగపడాలని సూచించారు. ఏమాత్రం మనస్సున్నా పీ4 ఆచరణ సాధ్యమేనని చంద్రబాబు పేర్కొన్నారు. ఉగాది రోజు పీ4 కార్యక్రమం గురించి మొదటిసారిగా చెప్పానని.. నేడు ప్రారంభించానని గుర్తుచేశారు. 13,40,600 బంగారు కుటుంబాలను ఇప్పడు మార్గదర్శులు దత్తతు తీసుకొంటున్నారని తెలిపారు. పీ4లో 15 లక్షలు కుటుంబాలను టార్గెట్‌గా పెట్టుకున్నామని…పీ4లో చేరాలని ఎవరినీ ఎలాంటి బలవంతం చేయడం లేదని… మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటే మీకు గొప్ప సంతృప్తి కలుగుతుందని చెప్పుకొచ్చారు. గివ్ బ్యాక్ అనేది మన సమాజ నినాదం కావాలని ఆకాంక్షించారు. డొక్క సీతమ్మ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలన్నారు. తిరుమల శ్రీవారి భక్తుడొకరు పారిశ్రామిక వేత్తగా ఎదిగేందుకు స్వామివారి ఆశీస్సులు కారణమని భావించి శ్రీవారికి 121 కేజీల బంగారం అంటే 140కోట్లు స్వామివారికి ఇచ్చారని గుర్తు చేశారు.
కుప్పంలో తాను స్వయంగా 250 కుటుంబాలను దత్తత తీసుకొని వారిని స్వయంగా మానిటర్ చేస్తున్నానని వివరించారు. ఇకపై ప్రభుత్వ పాలసీలు పేదలకు అనుకూలంగానే ఉంటాయని.. అదే సమయంలో సంపద సృష్టించాలని అన్నారు. అట్టడుగున సమాజంలో ఉన్నవారు చదువు, వైద్యం కూడా పొందలేకపోతున్నారని..ఒక వ్యక్తి ఒకేసారి ఇచ్చారని గుర్తు చేశారు. అందరం ఓ రోజు చనిపోతాం ఎవ్వరూ శాశ్వతం కాదని..ఉన్నప్పుడు ఎంత మంచిపని చేశావన్నదే గుర్తుండి పోతుందన్నారు.
2047 నాటికి నెంబర్ వన్ అవుతాం
2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని..దేశంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం మరోసారి వైకుంఠపాళి ఆడకుండా ప్రజలు నమ్మకం ఉంచి కొనసాగిస్తే 2047 నాటికి నెంబర్ వన్ అవుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో 2020 విజన్ డాక్యుమెంట్ చెప్పాం… ఇప్పుడు ఊహంచిన దానికంటే ఎక్కువ అభివృద్ధి హైదరాబాద్‌లో చూస్తున్నాం అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ నాల్గోస్థానానికి వచ్చిందని..రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో మూడో స్థానానికి రానుందన్నారు. రాష్ట్రం కూడా అందులో కీలకంగా ఉండబోతుందని.లాజిస్టిక్స్‌పైనా పెద్ద ఎత్తున శ్రద్ధ పెట్టాం.సొంత ఇంటిపైనే విద్యుత్ ఉత్పత్తి సోలార్ వల్ల చేయగలుగుతున్నాం అని..స్వచ్ఛాంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం ఇచ్చాం..అగ్రిటెక్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం.704 సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో వాట్సాప్‌లో అందుబాటులోకి తెచ్చాం అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటే చాలా వరకూ ప్రయోజనం ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఇంటిస్థలం ఇవ్వడం , గ్యాస్ , సోలార్ , డిజిటల్ కనెక్టివిటీ ఇవ్వడం వంటివి చేస్తున్నాం. ఒక ప్యామిలీ ఒక ఎంట్రపెన్యూర్ అనే విధానం తీసుకున్నామని చంద్రబాబు వెల్లడించారు.