Andhra Pradesh : గోదావరిలో తప్పిన ప్రమాదం…నది మధ్యలో ఆగిన బోటు
గోదావరిలో 80 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటు సాంకేతిక లోపంతో నది మధ్యలో ఆగిపోవడంతో కలకలం. సకాలంలో రక్షాప్రక్రియతో అందరూ క్షేమం.
అమరావతి : ఏపీలోని కోనసీమ జిల్లా గోదావరి నదిలో పెను ప్రమాదం తప్పింది. నరసాపురం వైపు నుంచి సఖినేటి పల్లి వైపు వస్తున్న ప్రయాణికుల బోటు సాంకేతిక లోపంతో నది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో బోటులోని 80మంది ప్రయాణికులు ప్రాణభయంతో ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా బోటు ఆగిపోవడంతో వారు ఆందోళన చెందారు. దాదాపు అరగంటకు పైగా బోటు నది మధ్యలోనే నిలిచిపోయింది. బోటు సిబ్బంది బోటు ఇంజన్ మరమ్మతులకు ప్రయత్నించినప్పటికి సమస్య పరిష్కారం కాలేదు. దీంతో బోటు ఆపరేటర్లు నదీ తీరంలో ఉన్న అధికారులకు బోటు ఆగిపోయిన సమాచారం అందించారు.
ఆ వెంటనే అధికారులు, స్థానిక బోటు ఆపరేటర్లు స్పందించి మరోబోటును నదిలో ఆగిపోయిన బోటు వద్దకు పంపించారు. నిలిచిపోయిన బోటు నుంచి ప్రయాణికులను మరో బోటులోకి ఎక్కించారు. ఆ బోటు సహాయంతో మరమ్మతుకు గురైన బోటును కూడా ప్రయాణికులతో పాటే ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు అంతా క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి :
AUS vs ENG : యాషెస్ రెండో టెస్టులో అస్ట్రేలియా ఘన విజయం
Palash Muchhal & Smriti Mandhana’s Wedding Cancellation : నేను చీటర్ ను కాదు : పెళ్లి రద్దుపై పలాశ్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram