Pandugappa Fish : గోదావరిలో చిక్కిన పండుగప్ప చేప..భారీ ధరకు విక్రయం
గోదావరిలో అరుదైన 24 కేజీల భారీ పండుగప్ప చేప చిక్కింది. కాకినాడ సమీపంలో మత్స్యకారుడు ఈ చేపను రూ.16 వేల ధరకు విక్రయించాడు.
అమరావతి: గోదావరిలో ప్రత్యేక సందర్బాల్లో మాత్రమే దొరికే పులాసలు, పండుగప్ప(బర్రముండి) చేపలు అంటే చేపల ప్రియులలో యమ క్రేజ్. ఆరోగ్య పరిరక్షణలో ఔషధ గుణాలతో కూడిన పోషకాలతో ఉండే పులాస, పండుగప్పలు తినాలని ప్రజలు పోటీ పడుతుంటారు. అరుదుగా దొరికే పులాస, పండుగప్ప చేపలకు మార్కెట్ లో భారీ ధర లభిస్తుంటుంది. తాజాగా గోదావరి లో అరుదైన పండుగప్ప చేప లభ్యమైంది. కాకినాడ జిల్లా సమీపంలో యానాం ప్రాంతంలో దరియాలతిప్ప వద్ద గోదావరి నదిలో మత్యకారుల గాలానికి 24 కేజీల బరువైన భారీ పండుగప్ప చేప లభ్యమైంది. ఇటీవల ఇంత పెద్ద పండుగప్ప చిక్కలేదని స్థానికులు తెలిపారు.
మార్కెట్ లో పండుగప్ప చేప కొనుగోలుకు పోటీ నెలకొనగా..చివరకు తనకు దొరికిన పండుగప్ప చేపను మత్స్యకారుడు రూ. 16వేలకు విక్రయించాడు. పండుగప్ప చేప మాంసంలో ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ 12 పుష్కలంగా ఉంటాయని యానాం మత్స్యశాఖ ఏడీ దడాల గొంతెయ్య తెలిపారు. పండుగప్ప ఆరోగ్యానికి మంచిదని, గుండె, ఎముకల బలానికి తోడ్పడుతుందన్నారు. చేపల్లో పులస రారాజు ఐతే.. ఆ తర్వాతి స్థానం పండుగప్ప చేపదే. ఇగురు కూర, వేపుడుగా గోదావరి జిల్లాల్లో వండుకోవడం పరిపాటి. పులసల సీజన్ అయిపోయిన తర్వాత దొరికే పండుగప్ప చేపల కూరను స్థానికులు ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలలో ఉండే తమవారికి పంపిస్తుంటారు.
ఇవి కూడా చదవండి :
Jolin Tsai Performance On Anaconda : అద్బుతం..అనకొండ పాముపై యువతి స్వారీ వైరల్
Horoscope | సోమవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి జీవిత భాగస్వామితో కలహాలు..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram