వైఎస్సార్సీపీలో చేరిన జీవీఎంసీ స్వతంత్ర కార్పొరేటర్లు

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన వి.విజయసాయి రెడ్డివిధాత,విశాఖపట్నం, జూన్ 4: ఇటీవల జరిగిన విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధులుగా గెలుపొందిన ముగ్గురు కార్పొరేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరికతో కార్పొరేషన్‌లో వైఎస్సార్సీపీ బలం 61కి పెరిగింది.విశాఖ నగరం తిమ్మాపురంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యులు వి.విజయసాయి రెడ్డి సమక్షంలో జీవీఎంసీలోని 32, 35, 39వ వార్డులకు చెందిన స్వతంత్ర కార్పొరేటర్లు కందుల నాగరాజు, విల్లూరి భాస్కరరావు, […]

వైఎస్సార్సీపీలో చేరిన జీవీఎంసీ స్వతంత్ర కార్పొరేటర్లు

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన వి.విజయసాయి రెడ్డి
విధాత,విశాఖపట్నం, జూన్ 4: ఇటీవల జరిగిన విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధులుగా గెలుపొందిన ముగ్గురు కార్పొరేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరికతో కార్పొరేషన్‌లో వైఎస్సార్సీపీ బలం 61కి పెరిగింది.విశాఖ నగరం తిమ్మాపురంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యులు వి.విజయసాయి రెడ్డి సమక్షంలో జీవీఎంసీలోని 32, 35, 39వ వార్డులకు చెందిన స్వతంత్ర కార్పొరేటర్లు కందుల నాగరాజు, విల్లూరి భాస్కరరావు, మహమ్మద్‌ సాధిక్‌లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.విజయసాయి రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

వీరితోపాటు జీవీఎంసీ మాజీ కార్పొరేటర్, జనసేన నాయకుడు మువ్వల పోలారావు, టీడీపీ నాయకుడు సూరిశెట్టి లక్ష్మణ్‌ కూడా పార్టీలో చేరారు. అలాగే వైఎస్సార్సీపీ నుండి సస్పెన్షన్‌కు గురైన తాతారావును కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో విశాఖ నగరంలో పార్టీని మరింత బలోపేతం చేసే కార్యాచరణపై వారితో చర్చించడం జరిగింది. సమావేశంలో పార్టీ నగర శాఖ అధ్యక్షుడు వంశీ కృష్ణ యాదవ్, విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ పరిశీలకుడు కేకే రాజు కూడా పాల్గొన్నారు.