కరోనా చికిత్సపై హైకోర్టులో విచారణ

విధాత‌: కరోనా చికిత్సలపై దాఖలైన వ్యాజ్యాలపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణ జరిగింది. చిత్తూరు, తూ.గో.జిల్లాలో కేసులు పెరగడంపై ధర్మాసనం ఆరా తీసింది. టీచర్లు, న్యాయవాదులకు వ్యాక్సినేషన్‌పై ప్రశ్నించింది. జనం గుమిగూడే ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధిక కేసులున్న జిల్లాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పింది. వ్యాక్సినేషన్‌ ఎప్పుడు పూర్తవుతుందని హైకోర్టు ప్రశ్నించగా.. 45ఏళ్లు నిండిన వారిలో 90% మందికి టీకాలు వేశామని ప్రభుత్వం తెలిపింది. మిగిలిన వారికి వ్యాక్సినేషన్‌ జరుగుతుందని వెల్లడించింది. సెప్టెంబర్‌ 8నాటికి […]

కరోనా చికిత్సపై హైకోర్టులో విచారణ

విధాత‌: కరోనా చికిత్సలపై దాఖలైన వ్యాజ్యాలపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణ జరిగింది. చిత్తూరు, తూ.గో.జిల్లాలో కేసులు పెరగడంపై ధర్మాసనం ఆరా తీసింది. టీచర్లు, న్యాయవాదులకు వ్యాక్సినేషన్‌పై ప్రశ్నించింది. జనం గుమిగూడే ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధిక కేసులున్న జిల్లాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పింది. వ్యాక్సినేషన్‌ ఎప్పుడు పూర్తవుతుందని హైకోర్టు ప్రశ్నించగా.. 45ఏళ్లు నిండిన వారిలో 90% మందికి టీకాలు వేశామని ప్రభుత్వం తెలిపింది. మిగిలిన వారికి వ్యాక్సినేషన్‌ జరుగుతుందని వెల్లడించింది. సెప్టెంబర్‌ 8నాటికి స్టేటస్‌ రిపోర్టు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.