ఆనందయ్య ఔషధం పంపిణీపై హైకోర్టులో విచారణ

విధాత:నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఔషధం పంపిణీపై ఆనందయ్యతో పాటు పలువురు వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ.ఈ మందుపై కేంద్ర ప్రభుత్వం పరిశోధన చేయాలని కోరిన పిటిషనర్లు.దీనికి కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది స్పందిస్తూ పరిశోధన చేయాలని కేంద్రానికి ఏ దరఖాస్తు రాలేదన్నారు. మరోవైపు ఆనందయ్య కంటి చుక్కల మందు ల్యాబ్‌ రిపోర్టును కోర్ట్ కు సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం.కంటి చుక్కల మందు నిర్దిష్ట ప్రమాణాలతో లేదని రిపోర్టులు వచ్చాయని వివరించిన ప్రభుత్వం తరుపు న్యాయవాది.15 […]

ఆనందయ్య ఔషధం పంపిణీపై హైకోర్టులో విచారణ

విధాత:నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఔషధం పంపిణీపై ఆనందయ్యతో పాటు పలువురు వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ.ఈ మందుపై కేంద్ర ప్రభుత్వం పరిశోధన చేయాలని కోరిన పిటిషనర్లు.దీనికి కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది స్పందిస్తూ పరిశోధన చేయాలని కేంద్రానికి ఏ దరఖాస్తు రాలేదన్నారు.

మరోవైపు ఆనందయ్య కంటి చుక్కల మందు ల్యాబ్‌ రిపోర్టును కోర్ట్ కు సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం.కంటి చుక్కల మందు నిర్దిష్ట ప్రమాణాలతో లేదని రిపోర్టులు వచ్చాయని వివరించిన ప్రభుత్వం తరుపు న్యాయవాది.15 సంస్థల నివేదికల్లో ‘నాట్‌ గుడ్‌’ అనే ఫలితాలు వచ్చాయని తెలిపిన ప్రభుత్వము తరుపు న్యాయవాది.దీనిపై వాదనలు వినిపించేందుకు సమయం కోరిన ఆనందయ్య తరఫు న్యాయవాది.

అనంతరం ఈ పిటిషన్లపై వాదనలను రెండు వారాలకు వాయిదా వేసిన ధర్మాసనం.