ఎస్వీ వెటర్నరీ వర్శటీతోపాటు తిరుపతిలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆనందయ్య మందు పంపిణీ
విధాత:బీసీ జేఏసీ జాతీయ కన్వీనర్ వల్లిగట్ల రెడ్డప్ప ఆదేశాల మేరకు ఎపిలోని పలు చోట్ల ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమాని బీసీ సంఘాల నేతలు చేపట్టారు. సోమవారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మదనపల్లెలో సోమవారం పంపిణీని చేపట్టారు. బీసీ జేఏసీ యువజన విభాగం రాయలసీమ అధ్యక్షులు డాక్టర్.ఉప్పర సొట్ట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తిరుపతిలో పంపిణీ ప్రారంభించారు. వర్శటీల్లో అధ్యాపకులకు, కాలనీల్లో ప్రజలకు మందు పంపణీని చేశారు. శుక్రవారం తిరుపతి లోని పలు ప్రాంతాల్లో జాతీయ బి.సి.జె.ఏ.సి.కన్వీనర్ […]

విధాత:బీసీ జేఏసీ జాతీయ కన్వీనర్ వల్లిగట్ల రెడ్డప్ప ఆదేశాల మేరకు ఎపిలోని పలు చోట్ల ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమాని బీసీ సంఘాల నేతలు చేపట్టారు. సోమవారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మదనపల్లెలో సోమవారం పంపిణీని చేపట్టారు.

బీసీ జేఏసీ యువజన విభాగం రాయలసీమ అధ్యక్షులు డాక్టర్.ఉప్పర సొట్ట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తిరుపతిలో పంపిణీ ప్రారంభించారు. వర్శటీల్లో అధ్యాపకులకు, కాలనీల్లో ప్రజలకు మందు పంపణీని చేశారు. శుక్రవారం తిరుపతి లోని పలు ప్రాంతాల్లో జాతీయ బి.సి.జె.ఏ.సి.కన్వీనర్ వల్లిగట్ల రెడ్డప్పన్న ఆదేశాలమేరకు డైరీ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాల టీచింగ్ ,నాన్ టీచింగ్ , కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్థులందరికి ఆనందయ్య కరోన నివారణ ఔషాదాన్ని పంపిణీ చేశారు.