టీటీడీ నూతన ఈవోగా ఐఏఎస్ జే.శ్యామలరావు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి జే. శ్యామలరావు ఆదివారం బాధత్యలు స్వీకరించారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామిని.. అనంతరం శ్రీవారిని శ్యామలరావు దర్శించుకున్నారు.
బాధ్యతల స్వీకరణ
విధాత : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి జే. శ్యామలరావు ఆదివారం బాధత్యలు స్వీకరించారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామిని.. అనంతరం శ్రీవారిని శ్యామలరావు దర్శించుకున్నారు. ఆ తర్వాత మాజీ ఈవో ధర్మారెడ్డి అధికారికంగా బాధ్యతలను శ్యామలరావుకు అప్పగించారు. నూతన ఈవో దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం ఇవ్వగా.. జేఈవోలు వీరబ్రహ్మం, గౌతమీ తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ టీటీడీ ఈవో కావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈవోగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు దన్యవాదాలని, టీటీడీలో పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తానని పేర్కోన్నారు. తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెడతానని, దర్శనానికి వచ్చిన వారు ఇబ్బంది పడకుండా వసతులు కల్పిస్తామని చెప్పారు. ఎక్కడైనా సమస్యలుంటే మా దృష్టికి తేవాలని ఈవో శ్యామలరావు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram