Kondagattu | కొండగట్టు ఆలయ ఈవో సస్పెన్షన్
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం కార్యనిర్వహన అధికారి టంకశాల వెంకటేశ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది
Kondagattu | జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం కార్యనిర్వహన అధికారి టంకశాల వెంకటేశ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆలయ సిబ్బంది అవినీతిపై నిర్లక్ష్యం వహించినందుకు ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌కు ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలను అప్పగించారు. కొండగట్టు ఆలయంలో ఉద్యోగులు రూ.60లక్షల వరకు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దుకాణాల లీజు వ్యవహారంలో గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల దేవాదాయశాఖ అధికారులు సైతం కొండగట్టులో విచారణ చేపట్టారు. రికార్డుల నిర్వహణ, పర్యవేక్షణ సరిగా లేకపోవడం, విధుల్లో అలసత్వం ప్రదర్శనకు పర్యవేక్షికుడితోపాటు సీనియర్ అసిస్టెంట్‌కు ఈవో టంకశాల వెంకటేశం మెమోలు జారీ చేశారు. 48 గంటల్లోగా వివరణను ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అవినీతి, అక్రమాలకు సిబ్బంది పాల్పడుతున్నా స్పందించడం లేదని తేలడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram