Janasena MLA Arava Sridhar : జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల కలకలం

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో వైసీపీ చేసిన పోస్టులు రాజకీయ కలకలం రేపుతున్నాయి.

Janasena MLA Arava Sridhar : జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల కలకలం

అమరావతి : జనసేన పార్టీ రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వైసీపీ చేసిన లైంగిక వేధింపులు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రభుత్వ ఉద్యోగినిని బెదిరించి అత్యాచారం చేశారని ఆరోపణలు చేస్తూ వైసీపీ పార్టీ ‘ఎక్స్’లో చేసిన పోస్టు సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో కాల్, వాట్సాప్ చాట్ లను వైసీపీ పోస్ట్ చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, హోం మంత్రి అనితలను ట్యాగ్ చేస్తూ వైసీపీ పోస్ట్ చేసింది. ఇదేనా మీరు మహిళలకు కల్పించే రక్షణ? ఈ బాధితురాలికి మీరు ఏం న్యాయం చేస్తారు? అని ప్రశ్నించింది.

ఫేస్ బుక్ పరిచయాన్ని ఆసరా చేసుకుని మహిళా ఉద్యోగిణిపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ కీచక పర్వం ప్రారంభించాడని, ప్రభుత్వ ఉద్యోగిని భయపెట్టి ఏడాదిన్నరగా అత్యాచారం చేశాడని ఆరోపించింది. కోరిక తీర్చకుంటే మూడేళ్ల కొడుకును చంపేస్తానని, భర్తకు విడాకులు ఇవ్వాలని మహిళను ఎమ్మెల్యే బెదిరించాడని వైసీపీ ఆరోపించింది. శ్రీధర్ వల్ల బాధిత మహిళా ఉద్యోగిని గర్భవతి అయిందని వైసీపీ పేర్కొంది. మహిళను బెదిరించి అబార్షన్ చేయించాడని కూడా వైసీపీ పోస్టులో ఆరోపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి :

Mother of All Deals | భారత్–ఈయూ వాణిజ్య ఒప్పందం: ’మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా చరిత్రలో నిలిచిపోయే ఘట్టం
Twenty20 Joins NDA | కిటెక్స్‌ సంస్థకు ఈడీ సమన్లు.. ట్వంటీ20ని ఎన్డీయేలో చేర్చిన కిటెక్స్‌ అధినేత