Krishna River : కృష్ణా నదిలో పాముల పోలిన చేపలు..వైరల్ గా వీడియో!
కృష్ణా నదిలో నాగాయలంక వద్ద పాముల్లా కనిపించే ఈల్ చేపలు వేలాదిగా కనపడి భక్తులు స్థానికులను ఆశ్చర్యపరిచాయి. ఈ దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్.
విధాత : సముద్రాల్లో..నదుల్లో రకరకాల జీవరాశులను చూస్తుంటాం. భౌగోళిక, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన జీవరాశులు కనిపిస్తుంటాయి. అలాగే కృష్ణానదిలో ఇప్పటివరకు న్నో రకాల చేపల జాతులను చూశాం. అయితే తాజాగా పాముల జాతి చేపల సమూహాలు ఒక్కచోట భారీ సంఖ్యలో దర్శనమివ్వడం చూస్తే మాత్రం వామ్మో అంటూ జడుసుకోక తప్పదు. కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద పవిత్ర కార్తిక మాసంలో స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపాన కృష్ణానదిలో వేలాదిగా పాములను పోలిన చేపలు నదిలో ఈదుతూ కనిపించాయి. ఆలయ పరిసరాల్లోని కృష్ణా నది ప్రవాహంలో పాములు గుంపులు గుంపులుగా సంచరిస్తున్న దృశ్యాలు అందరినీ విస్మయపరుస్తున్నాయి.
కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ పురాతన శివాలయం వద్ద ప్రతి ఏటా కార్తిక మాసంలో పాముల జాతి చేపలు కనిపించడం ఆనవాయితీ అని స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ప్రతి కార్తిక మాసంలో శివయ్యను దర్శించుకోవడానికి ఈ పాములు వస్తాయని, ఈసారి మరింత ఎక్కువ సంఖ్యలో రావడం శివుడి అనుగ్రహానికి నిదర్శనం అని ఒక భక్తులు చెబుతున్నారు. అయితే అవి పాములు కావని..అవి పాములు మాదిరిగా జీవించే ఈల్ జాతి చేపలు అని నిపుణులు చెబుతున్నారు. ఇవి నీటిలో ఈదడంతో పాటు నేల మీద కూడా పాకగలవు అంటున్నారు. ప్రపంచంలో దాదాపు 800 రకాల ఈల్ జాతులున్నాయి.
నాగాయలంక : బాబోయ్ పాములు.. ఒకటి కాదు రెండు కాదు.. వందల సంఖ్యలో పాములు🙏🏼🙏🏼
నాగాయలంక కృష్ణా నది తీరాన రామలింగేశ్వర స్వామి గుడి వెనుక నదిలో ఇలా పాములు కనిపించాయి.🙏🏼🙏🏼
ఇవాళ సాయంత్రం కూడా కనిపించే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసం లో ఇలా కనిపిస్తాయి అంటున్నారు 🙏🏼🙏🏼 pic.twitter.com/rjZmi72VXb
— Bhaskar Reddy (@chicagobachi) November 19, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram