NARA LOKESH | ఏజెంట్ మోసంతో ఏడారి దేశంలో మరో తెలుగు పౌరుడు … ఆదుకుంటానని మంత్రి లోకేశ్ హామీ
: గల్ఫ్ ఏజెంట్ల బారిన పడి ఏడారి దేశం సౌదీ అరేబియాలో ఒంటెల పోషణ పనిలో చిక్కుకుని అల్లాడుతున్నమరో తెలుగు పౌరుడి దీనగాధ సెల్ఫీ వీడియో ద్వారా వెలుగు చూసింది. ఏపీకి చెందిన వీరేంద్ర కుమార్ తన దుస్థితిని వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు

ఒంటెల పోషణ పనిలో బాధితుడు
తీవ్ర అనారోగ్యంతో ఆదుకోవాలని వీడియో సందేశం
విధాత, హైదరాబాద్ : గల్ఫ్ ఏజెంట్ల బారిన పడి ఏడారి దేశం సౌదీ అరేబియాలో ఒంటెల పోషణ పనిలో చిక్కుకుని అల్లాడుతున్నమరో తెలుగు పౌరుడి దీనగాధ సెల్ఫీ వీడియో ద్వారా వెలుగు చూసింది. ఏపీకి చెందిన వీరేంద్ర కుమార్ తన దుస్థితిని వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. ఏజెంట్లు వీరేంద్ర కుమార్‌ను ఖతార్ దేశంలో పని ఇప్పిస్తామని చెప్పి తీసుకవచ్చి సౌదీ అరేబియా ఎడారిలోకి ఒంటేల పోషణ పనిలో వదిలిపెట్టి వెళ్లిపోయారని వాపోయాడు. ఈనెల 11వ తేదీ నుంచి రక్తంతో వాంతులు వస్తున్నాయని, ముక్కు నుంచి రక్తం వస్తుందని, ఈ నరకం నుంచి నన్ను బయటపడేయాలని మొరపెట్టుకున్నాడు. ఏజెంట్‌కు 1లక్ష 70వేలు అప్పు చేసి ఇచ్చామని, ఇక్కడ తినడానకి తిండి, తాగడానికి నీళ్ల దొరకడం లేదని, మరో పది రోజులుంటే చనిపోవడం ఖాయమని వాపోయాడు. వీరేంద్ర వీడియో చూసిన ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ధైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదని ఆయన హామీ ఇచ్చారు.