Jeddah Tower : బుర్జ్ ఖలీఫాను మించి జెడ్డా టవర్.. ఏకంగా వెయ్యి మీటర్ల ఎత్తుతో!
బుర్జ్ ఖలీఫా రికార్డును తిరగరాస్తూ సౌదీ అరేబియా 1000 మీటర్ల ఎత్తుతో 'జెడ్డా టవర్'ను నిర్మిస్తోంది. 2028 నాటికి ఈ ప్రపంచ వింత పర్యాటకులకు అందుబాటులోకి రానుంది.
దుబాయిలో ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాను మించిన స్థాయిలో సౌది అరేబియా దేశంలోని జెడ్డాలో వేయి మీటర్ల ఎత్తులో జెడ్డా టవర్ నిర్మాణం చేస్తున్నారు. ప్రతి మూడు నాలుగు రోజులకు ఒక అంతస్తు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. జనవరి 2025లో ప్రారంభమైన టవర్ నిర్మాణ పనులు 2028 చివరి నాటికి పూర్తి కానున్నాయి. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా ఎత్తు 828 మీటర్లు కాగా జెడ్డా టవర్ ఎత్తు ఒక వేయి మీటర్లు (80 అంతస్తులు). ఈ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా పేరొందనున్నది.
సౌది అరేబియా విజన్ 2030 లో భాగంగా జెడ్డా టవర్ నిర్మాణ పనులు ప్రారంభించారు. జెడ్డా ఎకనామిక్ సిటీలో చేపట్టిన ఈ భవనంలో బహుళ సదుపాయాలు కల్పించనున్నారు. రెసిడెన్షియల్ ఫ్లాట్లు, ఫోర్ సీజన్ హోటళ్లు, లగ్జరీ రెసిడెన్షీ ఫ్లాట్లు, సర్వీసు అపార్ట్ మెంట్లు, అత్యాధునిక ఆఫీసు సౌకర్యాలు కల్పిస్తున్నారు. రెడ్ సీ చూసేందుకు వీలుగా పనోరమిక్ వ్యూ ను ఏర్పాటు చేస్తున్నారు. బుర్జ్ ఖలీఫాను డిజైన్ చేసిన ఆడ్రియన్ స్మిత్.. జెడ్డా టవర్ కు డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఎడారి ప్రాంతం కావడంతో ఎప్పుడు చల్లదనం ఉండేలా, సందర్శకులు, పర్యాటకులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు డిజైన్ చేశారు. తక్కువ ఇంధనంతో ఎక్కువ లైటింగ్, చల్లదనం వచ్చేలా విద్యుత్ పొదుపు చర్యలు తీసుకుంటున్నారు. ఒక సెకన్ సమయంలో ఒక అంతస్తు చేరుకునేలా అంత వేగవంతమైన, భద్రమైన లిప్టులను ఏర్పాటు చేస్తున్నారు.
దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా ప్రపంచంలో అనేక రికార్డులను సొంత చేసుకున్నది. ఆధునికమైన, అద్భుతమైన ఆర్కిటెక్చర్ దీని సొంతం. 122 లెవెల్ లో సందర్శకులు, పర్యాటకులు అత్యుత్తమమైన భోజనం, తినుభండారాలు తీసుకునేలా రెస్టారెంట్ ను తీర్చిదిద్దారు. భవనం చుట్టుపక్కల 26వేల గ్లాస్ ప్యానెళ్లను అమర్చి, అబ్బురపరిచేలా చేశారు. ఎండ వేడిమి లోనికి ప్రవేశించకుండా ఉండేలా వీటిని అమర్చారు. 2004 సంవత్సరంలో ప్రారంభమైన బూర్జు ఖలీఫా నిర్మాణం ఆరు సంవత్సరాల తరువాత 2010 లో పూర్తయ్యింది. 1.5 బిలియన్ డాలర్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు లో 12వేల మంది కార్మికులు, ఇంజినీర్లు భాగస్వామ్యం అయ్యారు. ఇంత ఖరీదైన భవనాన్ని ప్రపంచ దేశాల్లో ఎక్కడా నిర్మాణం చేయలేదు. ఈ భారీ భవనాన్ని ఎమ్మార్ ప్రాపర్టీస్ డెవలప్ చేయగా, ఆర్థిక సమస్యల కారణంగా దుబాయ్ రూలర్ మహ్మద్ బిన్ రషీద్ సహకారంతో పూర్తి చేశారు.
ఇవి కూడా చదవండి :
BSF jawan | బీఎస్ఎఫ్ జవాన్‌ను అపహరించిన పశువుల స్మగ్లర్లు..
Coastal Carpet Python : చెట్లు ఎక్కడంలో ఆ కొండ చిలువ స్పెషల్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram