• Telugu News
  • /News

Snow in Desert | ఎడారి దేశంలో మంచు తుపాన్.. UAEలో వడగండ్ల వానలతో ఆశ్చర్యంలో ప్రజలు!

Snow in Desert | సౌదీ అరేబియాలో వింత దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ఇటీవల ఏర్పడిన తీవ్ర తుపాన్ ప్రభావంతో బంగారు వర్ణంలో మెరిసిపోయే ఇసుక తిన్నెలు కాస్త.. ఇప్పుడు తెల్లటి మంచు దుప్పటిని కప్పుకున్నాయి.

Reported by: Chandram | వార్త‌లు | Mar 27, 2026, 8:45 pm IST
Read Time: 5 mins
Snow in Desert | ఎడారి దేశంలో మంచు తుపాన్.. UAEలో వడగండ్ల వానలతో ఆశ్చర్యంలో ప్రజలు!

Snow in Desert | యూఏఈలో వింత దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ఇటీవల ఏర్పడిన తీవ్ర తుపాన్ ప్రభావంతో బంగారు వర్ణంలో మెరిసిపోయే ఇసుక తిన్నెలు కాస్త.. ఇప్పుడు తెల్లటి మంచు దుప్పటిని కప్పుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE), ఖతర్, బహ్రెయిన్ వంటి దేశాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, గాలివానలు, వడగండ్ల వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

యూఏఈలోని రస్ అల్ ఖైమా (Ras Al Khaimah) ప్రాంతంలో ఎడారిని తెల్లటి మంచుతో కప్పేసింది. సుమారు 18 అంగుళాల వరకు వడగండ్లు పేరుకుపోవడంతో అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక అల్ ఐన్ (Al Ain) వంటి ప్రాంతాల్లో గోల్ఫ్‌బాల్ పరిమాణంలో వడగండ్లు పడ్డాయి. దీనివల్ల కార్ల అద్దాలు పగిలిపోవడమే కాకుండా, అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. సాధారణంగా తీవ్ర ఎండలు ఉండే ఈ ప్రాంతంలో ఇలాంటి అసాధారణ వాతావరణం చాలా అరుదుగా కనిపిస్తుందనే చెప్పాలి. ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన స్థానికులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు.

తుపాన్‌కు కారణమేంటి?

అసలు ఎడారిలో మంచు ఎలా కురుస్తోంది.. ఇలాంటి శీతల వాతావరణం ఏర్పడటానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అరేబియా సముద్రం, ఎర్ర సముద్రం నుంచి తేమను లాగుకుంటూ అల్పపీడనం ముందుకు సాగుతుందని.. దీనికారణంగానే పలు దేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, వడగండ్ల వానలు కురుస్తాయని చెబుతున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది.. దీనివల్ల వర్షాలు పడాల్సిన చోట కరువు, ఎడారి ప్రాంతాల్లో వరదలు వంటి అసాధారణ మార్పులు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

 


ఈ అల్ప పీడనం కారణంగా పలు ప్రాంతాల్లో 3 నుంచి 6 అంగుళాల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇది అక్కడి వార్షిక వర్షపాతానికి సమానమని నిపుణులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా ఒమన్, యూఏఈలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎడాది దేశాల్లో డ్రైనేజీ వ్యవస్థ భారీ వరదలు తట్టుకునే స్థితిలో ఉండవు కాబట్టి.. తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి.

Read More: