Coastal Carpet Python : చెట్లు ఎక్కడంలో ఆ కొండ చిలువ స్పెషల్
వేల సంఖ్యలో కండరాలు, వందల వెన్నుపూసలు.. కోస్టల్ పైథాన్ చెట్లు ఎక్కే తీరు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! దాని ప్రత్యేక శరీర నిర్మాణం గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ చదవండి.
విధా,త : కొండచిలువలు, అనకొండలు నీళ్లలో ఈదడంలో, చెట్లను ఎక్కడంలో రెండింటిలోనూ నైపుణ్యం కలిగి జీవిస్తుంటాయి. అయితే ఓ కొండ చిలువ జాతి మాత్రం ప్రత్యేక శరీర నిర్మాణంతో చెట్లను ఎక్కడంలో నేర్పరిగా మనుగడ సాగిస్తుంది. కోస్టల్ కార్పెట్ పైథాన్‌లగా పిలిచే ఈ కొండ చిలువల శరీర నిర్మాణంలో 10,000 నుండి 15,000 వరకు కండరాలు ఉంటాయట. మనుషులకు కేవలం 650నుంచి నుండి 850 కండరాల మాత్రమే ఉంటాయి. తనకున్నఅధిక కండరాల నిర్మాణంతో కూడిన శరీరంతో కోస్టల్ పైథాన్ చెట్టును ఎక్కెటప్పుడు ఒక్కో భాగంవైపు సుమారు 25 కండరాలు 400 వెన్నుపూసలను ఉపయోగిస్తూ పైకి ఎక్కుతుంది. ఈ వీడియోలో ఓ కోస్టల్ పైథాన్ పొడవాటి, బరువైన శరీరం ఉన్నప్పటికి..ప్రత్యేక కండరాల వ్యవస్థ సహాయంతో సునాయసంగా పొడువైన చెట్టును ఎక్కుతు ఆకట్టుకుంటుంది.
తూర్పు ఆస్ట్రేలియాకు చెందిన మోరెలియా స్పిలోటా ఉపజాతిగా పిలువబడే కోస్టల్ కార్పెట్ పైథాన్ (మోరెలియా స్పిలోటా మెక్‌డోవెల్లి) తీరప్రాంత ఆవాసాలలో, అడవుల్లో ఎక్కువగా నివసిస్తుంటుంది. 2.7–4.0 మీటర్ల వరకు పెరుగుతుంది. 20-30 సంవత్సరాల వరకు జీవిస్తుంది. వివిధ రకాల క్షీరదాలు, పక్షులను, ఎలుకలను తినే మాంసాహారి. అవి నేలపై, చెట్ల కొమ్మలపై, వర్షారణ్యాలు, తడి లేదా పొడి యూకలిప్టస్ అడవులు, పచ్చిక బయళ్లు, పొదలను ఆవాసంగా చేసుకుంటాయి.
ఇవి కూడా చదవండి :
Tanuja | తనూజ విన్నర్ కానందుకు వెక్కి వెక్కి ఏడ్చిన లేడి ఫ్యాన్.. వైరల్ అవుతున్న వీడియో
Revanth Reddy| సభకు రా..చర్చిద్దాం : కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram