Viral Video : ఏం మింగిందో…భారీ పొట్టతో కొండ చిలువ అవస్థలు!

భారీగా మింగేసిన ఆహారం భారంతో అడవిలో నానా అవస్థలు పడుతున్న కొండ చిలువ వీడియో వైరల్. కదలలేక ఇబ్బంది పడుతున్న వీక్షణలు నెటిజన్లకు నవ్వులు పంచుతున్నాయి.

Reported by: Tejaswini Nanna | వీడియోలు | Nov 28, 2025, 4:11 pm IST
Read Time: 3 mins
Viral Video : ఏం మింగిందో…భారీ పొట్టతో కొండ చిలువ అవస్థలు!

విధాత: మనుషులను సైతం మింగేసే కొండచిలువలు జంతువులను మింగేయడం పెద్ద పనేం కాదు.. కొండ చిలువలు వాటి సైజును కూడా పట్టంచుకోకుండా ఒక్కోసారి తమ శరీరాకృతికి మించి జంతువులను మింగేస్తుంటాయి. ఈ క్రమంలో మింగేసిన జంతువును కడుపులో అరిగించుకోలేక అవస్థలు పడుతుంటాయి. ఓ కొండ అజీర్తి అవస్థల ఫన్నీ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

ఓ గోదుమరంగు కొండచిలువ అటవీ ప్రాంతంతో ఏదో జంతువును మింగేసింది. మింగేసిన జంతువును కడుపులో అరిగించుకోలేక..అక్కడి నుంచి ముందుకు కదలలేక అడవిలో నానా అవస్థలు పడింది. పొట్టలోని జంతువు భారంతో ఏర్పడిన ఆయాసం ఒకవైపు.. ఉన్న చోట ఉంటే తాను..మరో జంతువు ఆహారంగా మారిపోతానన్న భయం ఇంకోవైపు కొండచిలువను ఉక్కిరి బిక్కిరి చేసింది. అతికష్టం మీద తాను మింగేసిన జంతువును కడుపులోనే మోస్తూ..ముందుకు పాకలేక ఆగి సాగుతూ కొండ చిలువ ఇబ్బంది పడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పీకల దాక తింటే ఇలాగే ఉంటదన్న సామేతను గుర్తు చేస్తూ కొండ చిలువ పరిస్థితిపై సెటైర్లు వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Amaravati| అమరావతిలో 25బ్యాంకులు..ప్రభుత్వ రంగ సంస్థలకు శంకుస్థాపన
Maoists| జనవరి 1న సాయుధ విరమణ: మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన