Nara Bhuvaneswari : ఫ్రీ బస్సులో ప్రయాణించిన నారా భువనేశ్వరి
కుప్పంలో పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి స్త్రీ శక్తి ఉచిత బస్సులో ప్రయాణించి, మహిళల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రజా దర్బార్‌లో వినతులు స్వీకరించారు.
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి,ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మూడవ రోజు శాంతిపురం మండలంలో పర్యటించారు. ఆర్టీసీ స్త్రీ శక్తి ఉచిత బస్సు లో భువనేశ్వరి ప్రయాణించారు. ఆధార్ కార్డు చూపించి, ఫ్రీ టికెట్ పొంది, శాంతిపురం నివాసం నుంచి తుమ్మిసి వరకూ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్బంగా బస్సులోని మహిళలతో భువనేశ్వరి మాట్లాడారు. సీఎం చంద్రబాబు మహిళల కోసం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు తీరుతెన్నులు, ఇతర సమస్యలపై వారి అభిప్రాయాలను భువనేశ్వరి తెలుసుకున్నారు.
అంతకు ముందు శాంతిపురం మండలం శివపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌లో స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram